Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరు మార్చుకుంటున్న ఫిలిమ్ ఛాంబర్‌!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (21:39 IST)
మదరాసు నుంచి హైదరాబాద్‌కు ఇండస్ట్రీ తరలి వచ్చినప్పుడు అప్పటి మదరాసు ఛాంబర్‌ను తెలుగులో మారుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌గా పేరు పెట్టారు. కాగా, ఇప్పుడు  రాష్ట్రాల విభజనతో తెలంగాణా కూడా కొత్తగా ఛాంబర్‌ ఏర్పాటు చేయడంతో తప్పని పరిస్థితుల్లో పేరు మార్చాల్సి వచ్చింది. ఇప్పటికి విజయవాడలో ఫిలిం ఛాంబర్‌ వుంది. 
 
ముందుముందు విజయవాడ, వైజాగ్‌లో సినిమా రంగం అబివృద్ధి చెందేలా ఇంటర్‌నల్‌గా ప్లాన్‌లు జరుగుతున్నాయి. అందుకే ఆదివారంనాడు ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ అఫ్‌ కామర్స్‌ మెంబర్స్‌ అంతా కలిసి విజయవాడలో మీటింగ్‌ జరిపారు. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేరు మార్చడానికి వారు చర్చలు జరుపుతున్నారు.
 
ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అని ఉన్న పేరును తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ అఫ్‌ కామర్స్‌ అనే పేరులో మార్చడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఛాంబర్‌ను తెలుగు.. పేరుగా మారిస్తే.. తెలంగాణ వారు ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు కూడా ఇది చర్చకు తావిచ్చింది. మరి ఈ విషయంలో ఫైనల్‌ నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments