Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ 'సరళా ఆంటీ' ఎవరబ్బా?.. అంత డౌటెందుకబ్బా..? అంటూ...

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (16:20 IST)
రామ్‌గోపాల్ వర్మ సినిమా బిగిన్ చేసిన దగ్గర్నుంచీ జనాల్లో చర్చ నడుస్తుండటం వర్మ సినీమా టెక్నిక్. సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా చెత్త సినిమా తీసి కూడా కలెక్షన్లు రాబట్టడం ఆయనకే చెల్లింది. రాంగోపాల్‌ వర్మ అంటే ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ గుర్తింపు వుండేది. ఇప్పుడు అది ఒక్కసారిగా పడిపోయిందని అంటున్నారు. అతన్ని ఎవ్వరూ లెక్కచేయడంలేదట ఇండస్ట్రీలో. 
 
కొత్తకొత్త పదాలతో ఫ్లోకామ్‌ టెక్నాలజీ అంటూ సినిమాలు తీస్తున్నట్లు చెబుతున్నాడు. ఇవి హలీవుడ్‌లో వున్న ప్రవాసాంద్రులు యువత డాక్యుమెంటరీలు తీసి చూపించేస్తున్నారు. ఇటీవలే అయోధ్యకుమార్‌ అనే దర్శక నిర్మాత మాట్లాడుతూ... ఈ టెక్నాలజీ కొత్తగా ఇప్పుడు రాలేదు. ఎప్పుడో వచ్చింది. దాన్ని వర్మ కొత్తగా చెప్పేదేముంది. 
 
ఏదో పేరుతో ఆయన జనాల్ని ఆకట్టుకుంటున్నాడని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన ఐదురోజుల్లో సినిమాలు తీసేసి చుట్టేసే నిర్మాత రామసత్యనారాయణతో ఐస్‌క్రీమ్‌ సినిమాలు ఐదు భాగాలు తీస్తున్నాడు. దాంతో ఆయన క్రేజ్‌ మరింత తగ్గింది. రెమ్యునరేషన్‌ కూడా తక్కువగానే తీసుకుంటున్నాడని అంటున్నారు. బాలీవుడ్‌లో 'ఎక్సెస్‌' అనే పేరుతో సినిమా చేస్తున్నాడు. తెలుగులో 'కోరిక' పేరుతో రాబోతుంది. ఇది మలయాళ షకీలా తరహా సినిమాగా చెప్పుకుంటున్నారు. 
 
బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ను నటింపజేసేందుకు సంప్రదించారు. ఇందులో ఆమె పేరు సరళ.. ఆంటీ... అట. మరి ఆమెతో ఎటువంటి సినిమా చేస్తాడో.. దానితో ఇండస్ట్రీని ఎంతగా దిగజారుస్తాడో... అంటున్నారు సినీజనం. తొలుత సరళ ఆంటీ ఎవరబ్బా... అని ఆలోచించినవారికి అంత డౌటెందుకబ్బా అంటూ సన్నీ లియోన్ పేరును తెరపైకి తెచ్చేశాడు వర్మ.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments