Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజలీ... ప్లీజ్ అంజలి.. నన్ను కరుణించవా : దర్శకుడు కళంజియం వేడుకోలు!

Webdunia
మంగళవారం, 26 ఆగస్టు 2014 (10:21 IST)
టాలీవుడ్ బ్యూటీ అంజలిని తమిళ దర్శకుడు కళంజియం ప్రాధేయపడుతున్నాడు. తనపై కరుణ చూపాలంటూ కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఇదే అంజలిని నలుగురి ముందు నవ్వుల పాలుజేసేందుకు ఈ తమిళ దర్శకుడు కోర్టు మెట్లెక్కిన విషయం తెల్సిందే. ఇపుడే ఇదే కళంజియం నటి అంజలి కరుణాకటాక్షాల కోసం ఎదురుచూస్తుండటం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో ఓ లుక్కేద్ధాం. 
 
ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కళంజియం ప్రస్తుతం ఆస్పత్రిలో ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయన కారు పంక్చరు కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, కళంజియం తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గతంలో అంజలికి ఓ సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్సు తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు. 
 
ఇలాంటప్పుడు అంజలి తన డబ్బులు వాపస్ చేస్తే బాగుండునని కోరుకుంటున్నాడు. అయితే ఈ డబ్బుపై కళంజియం ఇంతకుముందు రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అంజలిపై పరువు నష్టం పిటిషన్ కూడా వేశాడు. తమిళ నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయకూడదని సినీ అసోసియేషన్ ముందు పంచాయతీ పెట్టాడు. సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకుని ప్లేటు ఫిరాయించిందంటూ కళంజియం కోర్టు తలుపు తట్టాడు. 
 
ఆ తరువాత ఆమె పిన్ని పెట్టిన మిస్సింగ్ కేసులో కూడా కళంజియం ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలొచ్చిన సంగతి తెలిసిందే. అతని వేధింపులు తాళలేకే అంజలి దాక్కుందన్న వార్తలు కూడా విదితమే. ఇప్పుడు అదే దర్శకుడు దయనీయస్థితిలో ఆమెను వేడుకుంటున్నాడు. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఇదేనేమో..! 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments