Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పటాస్' బాగా పేలిందట... ఎమౌంట్ నాలుగు రోజుల్లో వచ్చేసింది... దిల్ రాజు

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (13:13 IST)
'పటాస్‌' చిత్రం చాలా మాసివ్‌గా వుంది. ఫస్ట్‌ టైం పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన కళ్యాణ్‌ రామ్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. 'పటాస్‌'లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అద్భుతంగా వుంది. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి టేకింగ్‌ ఎక్స్‌లెంట్‌. నందమూరి కళ్యాణ్‌రామ్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ ఫెంటాస్టిక్‌.. ఇవి 'పటాస్‌' చిత్రం గురించి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో వినిపిస్తున్న టాక్‌. 

 
నందమూరి కళ్యాణ్‌ రామ్‌, శృతిసోడి హీరోయిన్‌గా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై రచయిత అనిల్‌ రావిపూడిని దర్శకునిగా పరిచయం చేస్తూ నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మించిన 'పటాస్‌' చిత్రం వరల్డ్‌వైడ్‌గా జనవరి 23న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అత్యధిక ఓపెనింగ్స్‌ని సాధించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు రిలీజ్‌ చేయడం విశేషం. 
 
ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ... ''సినిమా విడుదలకు ముందే సినిమాపై తొంబై శాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమా విడుదలైన తర్వాత మా అందరి నమ్మకాన్ని సినిమా నిజం చేసింది. ఆది సినిమాకి మేం పెట్టిన అమౌంట్‌ వారం రోజుల్లో తిరిగి వచ్చింది. 
 
అయితే ఈ సినిమాకి నాలుగు రోజుల్లోనే మేం పెట్టిన మొత్తం తిరిగి వచ్చేసింది. నందమూరి కల్యాణ్‌ రామ్‌ గారికి చాలా రోజులకు సరైన కమర్షియల్‌ సక్సెస్‌ వచ్చింది. అలాగే ఇండస్ట్రీకి మరో కమర్షియల్‌ సినిమాలను డైరెక్ట్‌ చేసే దర్శకుడు దొరికాడు. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments