Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కరెంట్ తీగ' సరే... నాకు 'కటకటాల రుద్రయ్య' కావాలి... దాసరి

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (14:39 IST)
సినిమా రంగంలో కెరీర్‌గా పదేళ్ళు నిండాయని చెప్పడం పెద్ద విషయం కాదు. ఆ తర్వాతే అసలు కెరీర్‌. నా దృష్టిలో మంచు మనోజ్‌కు అసలు కెరీర్‌ ఈ చిత్రంతోనే వస్తుందని దాసరినారాయణ అన్నారు. మనోజ్‌ నటించిన 'కరెంట్‌ తీగ' ఆడియో విడుదల ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి తరం చాలాఫాస్ట్‌గా ఏక్ట్‌ చేస్తున్నారు. డాన్స్‌, ఫైట్లు బాగా చేస్తున్నారు. 
 
మనోజ్‌ బాగా చేస్తున్నాడు. కానీ ఈతరం టెక్నిక్‌ను సరిగ్గా వుపయోగించుకోవడంలేదు. దాన్ని బాగా ఉపయోగించుకుంటే చాలా మంచి సినిమాలు తీయవచ్చు. మోహన్‌ బాబు పిల్లల్ని చాలా కంట్రోల్‌గా పెంచాడు. మనోజ్‌ ఇంకా మంచి పాత్రలు చేయాలి. కటకటాల రుద్రయ్య, సర్దార్‌ పాపారాయుడు వంటి సినిమాలు చేయాలి. పరిశ్రమలో నా శిష్యులు చాలామంది వున్నారు. మోహన్ బాబుకు మనోజ్ కంటే ఆయన కుమార్తె లక్ష్మి గొప్ప శక్తిగా అండగా వుంది అని చెప్పారు
 
మోహన్‌ బాబు మాట్లాడుతూ... మనోజ్‌ను రిస్క్‌ తీసుకోవద్దని గురువుగారు చెబుతున్నారు. కానీ అవన్నీ గురువుగారి నుంచే వచ్చాయి. ఆయన ఆశీస్సులు మాకున్నాయి. భగవంతుడు జయాపజయాలు ముందే రాసేస్తుంటాడు. అందుకే రిస్క్‌లు చేయవద్దని మనోజ్‌కు చెబుతుంటాను. కరెంట్‌ తీగ అసెంబ్లీ రౌడీ అంతటి సినిమా అవుతుందని నమ్మకముందని తెలిపారు. ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments