Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ తీగ రివ్యూ రిపోర్ట్: మనోజ్.. సన్నీ అదుర్స్., మోస్తరు రేటింగ్!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (12:22 IST)
కరెంట్ తీగ రివ్యూ రిపోర్ట్ అదిరిపోయింది. తమిళంలో శివకార్తీకేయన్ నటించిన ''వరుత్తపడాదవాలిబర్ సంఘం''కు రీమేక్ అయిన కరెంట్ తీగకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మంచు, సన్నీ ఈ చిత్రంలో అదరగొట్టేశారని.. మోస్తరు రేటింగ్ పాయింట్స్ ఈ సినిమాకు లభించాయని టాక్ వచ్చేసింది. 
 
మీడియా ఫోకస్ చేయడంతో పాటు మాంచి పబ్లిసీటి కొట్టేసిన కరెంట్ తీగ శుక్రవారం 31 దేశాల్లో 700 సినిమా హాల్స్‌లో అట్టహాసంగా విడుదలైంది. కరెంట్ తీగ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రొమాన్స్, మ్యూజిక్, డ్యాన్స్, కామెడీ అదిరిపోయింది. 
 
మంచు మనోజ్ హీరోగా నటించే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. రాజామణి కంపోస్ చేసిన ట్యూన్స్ మ్యూజిక్ లవర్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి. 
 
తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు దర్శకుడు నాగేశ్వర రావు కమర్షియల్ అంశాలను మిళితం చేసి ప్రేక్షకులకు అందించాడు. అలాగే సన్నీలియోన్ హాట్ సాంగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. 
 
కథలోకి వెళితే.. కరెంట్ తీగ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతోంది. పనీపాట లేకుండా గాలికి తిరిగే వాడిగా మంచు మనోజ్ (రాజు) నటించగా.. స్కూల్ టీచర్‌గా సన్నీ (సన్నీలియోన్) నటిస్తుంది. రాజు సన్నీ ప్రేమలో పడతాడు. ఈ ప్రేమకు రాయబారిగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (కవిత)ను పంపుతాడు. టీచర్ సన్నీకి లవ్ లెటర్, గిఫ్టులు కవిత ద్వారా అందిస్తాడు. అయితే సన్నీకి పెళ్లి నిశ్చయం కావడంతో మనోజ్ దేవదాసులా కాకుండా కవిత ప్రేమలో పడుతాడు. 
 
ఇక కవిత తండ్రి శివరామ రాజు (జగపతి బాబు) కవితకు మైనర్‌గా ఉండగానే పెళ్లి చేసేందుకు సర్వం సిద్ధం చేస్తాడు. ఈ పెళ్లిని రాజు ఆపుతాడు. మరి కవిత-రాజు ప్రేమకు శివరామ రాజు ఒప్పుకుంటాడా.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఇక సినిమా చూడాల్సిందే. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments