Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఎన్నికల సభ్యులు 739 మంది.. ఓట్లు 702 మందికే..!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (14:13 IST)
ఎన్నడూ లేని విధంగా ఈ సారి మా ఎన్నికలు పోటా పోటీగా జరిగాయి. మా అధ్యక్ష పదవి కోసం రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీపడ్డారు. ఈ రెండు ప్యానెల్ లో ఉన్నవారు ఒకరినొకరు దూషించుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల విషయాన్ని పక్కనపెట్టి పర్శనల్ విషయాలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. 
 
ఇంకా ఆ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరి వ్యవహారం వినోదంగా మారింది. ఇదిలా ఉంటె నిన్న మా ఎలక్షన్స్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం ఇందులో జీవితకాల సభ్యులు 709 మంది ఉండగా, గౌరవ సభ్యులు ఇద్దరు, సీనియర్ సిటిజన్స్ 28 మంది ఉన్నారు.
 
మొత్తంగా మా లో ఉన్న సభ్యుల సంఖ్య 739. అయితే వారిలో ఓటు హక్కు ఉన్నది మాత్రం 702 మందికే. గత కొన్ని రోజులుగా ఎన్నికల పరంగా వివాదాలు జరుగుతున్న కారణంగా కొంతమంది సభ్యులు పోలింగ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. 
 
ఇకపోతే ఓటింగ్ శాతం ఎంత ఉంటుందనేది తెలియాలంటే మరొకొన్ని రోజులు ఆగాల్సిందే. మా ఎన్నికల గొడవ కోర్టుకెక్కడంతో సివిల్ కోర్టు ఆదేశాల ప్రకారమే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కోర్టు తదుపరి తేది ప్రకటించేవరకు కౌంటింగ్ జరిగే ప్రసక్తే లేదు. దీంతో కోర్టు ఉత్తర్వుల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments