Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అభినందన' దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ కన్నుమూత

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (10:55 IST)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, సినీ దర్శకుడు అశోక్ కుమార్ (72) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. గత ఆరు నెలలుగా ఆయన అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతూ వచ్చినట్టు ఆయన కుటుంబీకులు తెలిపారు. పలు ఆస్పత్రులలో ఆయనకు వివిధ చికిత్సలు అందించినట్టుగాను, చివరికి ఆయన ఆరోగ్యం మరీ విషమించడంతో కొన్ని రోజుల క్రితమే చెన్నైకి తీసుకొచ్చామని వారు తెలిపారు. 
 
అశోక్ కుమార్ పలు భారతీయ భాషల్లో దాదాపు వంద సినిమాలకు కెమెరామన్గా పనిచేశారు. జీన్స్ వంటి పలు చిత్రాలు ఆయన కెమెరా నుంచి జాలువారినవే. భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో కలిసి అశోక్ కుమార్ పనిచేశారు. 
 
'నెంజతై కిల్లాతె' అనే తమిళ చిత్రానికి గాను 1980లో ఆయన ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా జాతీయ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా సచ్చాప్యార్ వంటి హిందీ, బ్యాక్ వాటర్స్ వంటి ఇంగ్లీషు సినిమాలకు కూడా ఆయన సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించి అభిమాన బలాన్ని పొందారు.
 
సినిమాటోగ్రాఫర్‌గానే కాకుండా దర్శకుడిగా కూడా అశోక్ కుమార్ సత్తా చాటుకున్నవారే. తెలుగులో సంచలన విజయం సాధించిన ప్రేమకథా చిత్రం 'అభినందన' వంటి కొన్ని తెలుగు సినిమాలతో సహా పలు తమిళ, హిందీ సినిమాలకు అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments