మెగాస్టార్ చిరంజీవి సినిమాలు.. ఆయన స్టైల్, ఆయన డ్యాన్స్ గురించి అందరికీ బాగా తెలిసిందే. డ్యాన్స్, ఎమోషనల్ సీన్స్‌ను రక్తికట్టించే మెగాస్టార్ చిరంజీవి.. నగ్మతో లిప్ లాక్ చేయలేకపోయారట. అప్పట్లో గ్లామర్ తారగా ఓ వెలుగు వెలిగిన నగ్మతో మెగాస్టార్ పెదవులు కలుపలేకపోయాడని నగ్మ స్వయంగా తెలిపింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ''ఘరానా మొగుడు'' సినిమా షూటింగ్లో భాగంగా ఓ లిప్ లాక్ సీన్‌ను ఖాయం చేసుకున్నారు.
అప్పటికే నగ్మా మూడు బాలీవుడ్ సినిమాలు నటించింది. కొన్ని లిప్ లాక్ సీన్స్ చేసేసింది. అలాంటి నగ్మను చిరంజీవితో ఓ హాట్ రొమాంటిక్ లిప్ లాక్ సీన్ కోసం రాఘవేంద్రరావు ఒప్పించారు. ముందు నగ్మ ఒప్పుకోకపోయినా.. తర్వాత ఎలాగో ఒప్పేసుకుంది. ఇంకేముంది.. లిప్ లాక్ సీన్ షూటింగ్లో చిరంజీవి అసలు రంగేంటో బయటపడింది. నగ్మ లిప్ లాక్ సీన్‌ను కచ్చితంగా చేసేసినా.. చిరంజీవి మాత్రం స్ట్రగుల్ అయ్యారట.
ఈ విషయాలను రాఘవేంద్రరావు సౌందర్య లహరి కార్యక్రమంలో నగ్మ మాట్లాడుతూ..‘అపుడు లిప్ లాక్ సీన్ చేయడంలో చిరంజీవిగారు చాలా ఇబ్బంది పడ్డారు. సరిగా చేయలేక పోయారు. ఆ సీన్ చాలా బ్యాడ్‌గా వచ్చింది. ఆ సీన్ ఉంటే ఆయన ఇమేజ్ డ్యామేజీ అవుతుందని కట్ చేసారు' అంటూ చెప్పుకొచ్చింది. ఈ కార్యక్రమంలో తను నటించిన పలువురు తెలుగు హీరోల గురించి తన అభిప్రాయాలు చెప్పుకొచ్చింది.
పంక్చువాలిటీకి మారుపేరైన మోహన్ బాబును ఇండస్ట్రీలో అందరూ డిక్టేర్ అంటుంటే...‘మేజర్ చంద్రకాంత్' చిత్రంలో ఆమెతో నటించిన నగ్మ మాత్రం అతన్ని ఫన్నీ మేన్ అనేసింది. చిరంజీవి చాలా మంచి వాడని, బాలయ్యను కృష్ణుడు అని, వెంకీని సెంటిమెంట్ మ్యాన్ అని, నాగార్జున మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది.