Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఎన్నికలు.. చిరంజీవి మా రక్తం.. నాగబాబు మా గుండెకాయ : కాదంబరి కిరణ్!

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2015 (16:46 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మెగా బ్రదర్స్‌లలో ఒకరైన నాగబాబు తమకు గుండెకాయలా పని చేశారని ఈ ఎన్నికల్లో ఓ సభ్యుడిగా గెలుపొందిన కాదంబరి కిరణ్ చెప్పుకొచ్చారు. శుక్రవారం వెలువడిన మా ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి తమ వెన్నంటి ఉన్నారన్నారు. 
 
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు సహాయ సహకారాలతోనే తాము విజయం సాధించామన్నారు. అలాగే, మోహన్ బాబు, దాసరి నారాయణరావు, బాలకృష్ణ వంటి వారి మద్దతుతో తాము ధర్మయుద్ధం చేశామని ఆయన అన్నారు. కాస్తంత ఆవేశంగా మాట్లాడిన కిరణ్ ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. సినీనటుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 
 
అలాగే, ఈ ఫలితాలపై నాగబాబు స్పందిస్తూ.. ఈ పదవికి రాజేంద్రుడి ఎన్నిక ఏకగ్రీవంగా చేయాలనుకున్నామన్నారు. అలాగని తాము జయసుధకు వ్యతిరేకం కాదని వివరించారు. రాజేంద్రప్రసాద్ నలుగురికీ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టే ఆయన అధ్యక్షుడు అయితే బాగుంటుందని భావించి మద్దతు తెలిపామన్నారు. 
 
ఈ ఎన్నికలు ప్రతిసారీ ఏకగ్రీవంగా, ఏకపక్షంగా జరిగేవని ఈసారి మాత్రం అలా జరగకూడదని భావించామన్నారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ గెలవాలని కోరుకున్నాను గానీ చివరికి ఎవరు గెలిచినా మంచిదేనని భావించినట్టు వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా మొదట్లో జరిగిన కొన్ని పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయని, అసలు కోర్టు వరకు వెళ్లాలన్న ఆలోచన రాలేదని నాగబాబు వివరించారు. అయితే ఇవన్నీ నటుడు ఓ.కల్యాణ్ కు నచ్చలేనందువల్లే కోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments