Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి గురించి వినాయక్‌... ఒక్క నవ్వు నవ్వి కారులో చెక్కేశారు...

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (19:42 IST)
చిరంజీవి మళ్ళీ సినిమా చేయడం నిర్ణయమైంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజకీయ నేపథ్యం చిత్రం కాదు కనుక.. ఎవరిపై సెటైర్లు వేస్తారనే సందిగ్దత లేదు. ఒకవేళ వేస్తే.. అది తనపైకే ఎదురు తిరుగుతుందనే ఆలోచన కూడా వుంది. అందుకే ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంలో నటించడానికి గ్రీన్‌ స్నిగల్‌ ఇచ్చాడు. ఈ కథను ఐదుగురు సీనియర్‌ రచయితలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా సంభాషణలు రాసే సత్తావున్న పేరున్న రచయితలు వున్నారు. వారి పేర్లు త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా, చిరంజీవి 150 సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇంకా ప్రశ్నగా మిగిలి వుంది. ఈ విషయంలో వివినాయక్‌ పేరు కూడా పరిశీనలో వుంది. తనే స్వయంగా తన పుట్టినరోజు నాడు వినాయక్‌ చెప్పాడు. చిరంజీవిగారికి కథ చెప్పాను. అల్లుడు శ్రీను చిత్రం తర్వాత ఆయనతో మళ్ళీ కూర్చుంటానన్నాడు. అయితే బుధవారం నాడు ఈ విషయమై వినాయక్‌ను కదిలిస్తే... ఒక్క నవ్వు నవ్వి.. ఇదే సమాధానమన్నట్లు కారులో చెక్కేశారు. 
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంకా చిరంజీవి చిత్రానికి ఇంకా ఏ దర్శకుడూ ఫిక్స్‌ కాలేదు. మరోవైపు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, మణిరత్నం పేర్లు విన్పిస్తున్నాయి. అయితే మణిరత్నం చెప్పిన కథ నచ్చలేదని తెలిసింది. ఆమధ్య సుహాసిని కూడా చిరంజీవిని కలిసి మణిరత్నంతో కథ చెప్పించింది. ఇప్పుడు తెరపైకి త్రివిక్రమ్‌ వచ్చారు. అత్తారింటికి దారేది వంటి చిత్రాన్ని తీసి ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న తివ్రిక్రమ్‌ కరక్టేనని అంచనాకు చిరంజీవి వచ్చినట్లు ఆయన వర్గాలు తెలియజేస్తున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments