Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్ల గణేష్‌కు నోటీసులు : ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు!

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (16:37 IST)
సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బంజారాహిల్స్ పోలీసులు ఛీటింగ్ కేసులో నోటీసులు జారీ చేశారు. పవన్ కల్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా ఆంధ్రా ఏరియా హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్షియర్ ధర్మచరణ్ తులసీ 2011లో 80 లక్షల రూపాయలను నిర్మాత బండ్ల గణేష్‌కు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నారు. 
 
అగ్రిమెంట్ ప్రకారం సినిమా హక్కులు తనకు చెందాల్సి ఉండగా, నిర్మాత గణేష్ మరో వ్యక్తికి హక్కులు విక్రయించి ఛీటింగ్‌కు పాల్పడ్డారని ధర్మచరణ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 
దీంతో, పోలీసులు బండ్ల గణేష్‌కు నోటీసులు జారీ చేశారు. ధర్మచరణ్ చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని వారు నోటీసులో పేర్కొన్నారు. గణేష్ పరారీలో ఉండడంతో, అతనిపై ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేశారు. 
 
నోటీసులకు నిర్మాత స్పందించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments