Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్సిక ప్రధాన పాత్రలో సి.కళ్యాణ్‌ కొత్త చిత్రం 'చంద్రకళ'

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (18:42 IST)
'చందమామ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఇప్పుడు గ్లామర్‌స్టార్‌ హన్సిక ప్రధాన పాత్రలో 'చంద్రకళ' అనే భారీ చిత్రాన్ని సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ బేనర్‌పై సమర్పిస్తున్నారు. తమిళ్‌లో సెన్సేషనల్‌ హిట్‌ అయిన 'అరన్మణి' చిత్రాన్ని 'చంద్రకళ' పేరుతో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ బేనర్‌పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 'అరన్మణి' తెలుగు రైట్స్‌ కోసం చాలామంది పోటీపడినప్పటికీ భారీ ఆఫర్‌ ఇచ్చి సి.కళ్యాణ్‌ స్వంతం చేసుకున్నారు.

 
ఈ చిత్రం గురించి సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ - ''తమిళనాడులో ఇప్పటికే 24 కోట్లకుపై కలెక్ట్‌ చేసి సంచలన విజయం సాధించిన 'అరన్మణి'  తెలుగులో చాలా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకంతో ఫ్యాన్సీ ఆఫర్‌ ఇచ్చిన రైట్స్‌ తీసుకున్నాను. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత వుంటూ హార్రర్‌ టచ్‌తో చాలా థ్రిల్లింగ్‌గా సాగే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చంద్రకళ'. పూర్తిగా హైదరాబాద్‌లోనే నిర్మించిన సినిమా ఇది. డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఆడియో రిలీజ్‌ చేసి డిసెంబర్‌ మూడోవారంలో సినిమాని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. చందమామ తర్వాత మా బేనర్‌లోఇది మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు. 
 
హన్సిక, విమల్‌, లక్ష్మీరాయ్‌, ఆండ్రియా, సుందర్‌, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, సంతానం నటిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్‌కుమార్‌ ఫోటోగ్రఫీ పెద్ద ఎస్సెట్‌ అయింది. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ నిర్మించిన ఈ భారీ చిత్రానికి పాటలు: వనమాలి, మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, సంగీతం: కార్తీక్‌రాజా, భరద్వాజ్‌, ఫోటోగ్రఫీ: సెంథిల్‌కుమార్‌, ఫైట్స్‌: దినేష్‌, డాన్స్‌: రాజుసుందరం, గాయత్రి రఘురాం, శివశంకర్‌, సహనిర్మాత: పద్మాకరరావు వాసిరెడ్డి, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు,కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుందర్‌ సి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments