Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్‌ రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'చాక్లెట్‌'

Webdunia
సోమవారం, 17 నవంబరు 2014 (19:59 IST)
జైఆకాష్‌-అర్చన జంటగా, తమన్‌ సెకండ్‌ హీరోగా, కోమల్‌శర్మ, సొనాల్‌ ఝాన్సీ సైడ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం 'చాక్లెట్‌'. 'ఎ స్వీట్‌ రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌' అన్నది ట్యాగ్‌లైన్‌. ఎస్‌.వి.ఫిలింస్‌ పతాకంపై రామకృష్ణ వీర్నాల దర్శకత్వంలో- రావుట్ల లింగం నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ ప్రారంభించుకొంది. గురవారావు బత్తుల-సి.ఐ.శ్రీనివాస్‌ నిర్మాణ సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం విశేషాలు తెలపడానికి హైద్రాబాద్‌లోని ఫిలిం చాంబర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సమావేశంలో హీరో జైఆకాష్‌, హీరోయిన్‌ అర్చన, సెకండ్‌ హీరో తమన్‌, సైడ్‌ హీరోయిన్స్‌ కోమల్‌శర్మ-సొనాల్‌ ఝూన్సీ, దర్శకులు రామకృష్ణ వీర్నాల, నిర్మాత రావుట్ల లింగం, సంగీత దర్శకులు ఎల్‌.ప్రేమ్‌, డ్యాన్స్‌ మాస్టర్‌ ఆనంద్‌, చిత్రంశ్రీను, వాసు తదితరులు పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు.
 
పేరుకు తగ్గట్లుగా ఒక తియ్యని రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'చాక్లెట్‌' చిత్రం దర్శకుడిగా తనకు పేరు తెస్తుందని రామకృష్ణ వీర్నాల అశాభావం వ్యక్తం చేయగా.. 'చాక్లెట్‌' సినిమాతో నిర్మాతగా మారుతున్న రావుట్ల లింగంకు- ఓ 'చాక్లెట్‌' ఫ్యాక్టరీ పెట్టుకొనేంత దండిగా లాభాలు రావాలని హీరో జైఆకాష్‌ ఆకాంక్షించారు. 
 
ఈ చిత్రంలో ఓ సాంగ్‌ కోసం తను చేస్తున్న డ్యాన్స్‌కు చాలా గొప్ప కంపోజిషన్‌ కుదిరిందని హీరోయిన్‌ అర్చన ఆనందం వ్యక్తం చేసింది. 'చాక్లెట్‌' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేస్తున్న దర్శకనిర్మాతలకు కోమల్‌శర్మ కృతజ్ఞతలు తెలపగా.. ఈ సినిమాలో నటిస్తుండడం పట్ల సొనాల్‌ ఝాన్సీ సంతోషం వ్యక్తం చేసింది. 'చాక్లెట్‌' వంటి స్వీట్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ద్వారా నిర్మాతగా పరిచమవుతుండడం ఎగ్జయిటింగ్‌గా ఉందని రావుట్ల లింగం అన్నారు. మంచి మ్యూజిక్‌ చేయడానికి స్కోప్‌ గల సినిమాకు పని చేస్తుండడం పట్ల సంగీత దర్శకుడు ఎల్‌.ప్రేమ్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments