Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వచ్ఛ్ భారత్తా...? పబ్లిసిటీ భారత్తా...? చీపుర్లతో శీను ఫోజులా...?

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (15:24 IST)
ప్రధానమంత్రి ఇచ్చిన స్వచ్ఛభారత్‌ స్పూర్తిగా తెలుగు చలనచిత్రరంగంలో పలువురు హీరోలు, హీరోయిన్లు దర్శకులు రోడ్లను శుభ్రం చేసే పనిలో వున్నారు. అయితే ఇవన్నీ.. ఒట్టి ప్రచారం కోసమే అనే విమర్శలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. రెండురోజుల నాడు మంచు ఫ్యామిలీ ఇలాంటి కార్యక్రమం నిర్వహించింది. లక్ష్మీ మంచు హడావుడిగా కారులో వస్తూ... కారులోనే టిఫిన్‌ తింటూ... ఇక్కడ పిల్లలు వున్నారని తెలుసుకుని.. వెంటనే వాటిని అక్కడ పెట్టేసింది. కారు దిగగానే చీపురుతో పైపైన ఊడ్చేసి వెంటనే వెళ్ళిపోయింది. 

 
ఆదివారంనాడు బోయపాటి శ్రీను కూడా తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంటి పక్కనే వున్న కొద్దిపాటి చెత్తను రిక్షాలో వేసేసి వెళ్ళిపోయాడు. ఇలా ప్రముఖులు చేసే స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం ముందుగా మీడియాకు సందేశం ఇవ్వడం. దాన్ని అన్నిచోట్ల వచ్చేలా చేయమని చెప్పడం మామూలైపోయింది. అందుకే సోమవారం నాడు యమలీల-2 చిత్ర యూనిట్‌కు చేదు అనుభవం ఎదురైంది. 
 
అనుకున్నట్లుగా వారంతా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో స్వచ్ఛభారత్‌ నిర్వహిస్తున్నట్లు పిలుపు ఇచ్చారు. కానీ ముందుగా అక్కడికి వెళ్ళిన మేనేజర్‌ అక్కడి వాతావరణ చూసి అవాక్కయ్యాడు. ముందుగానే స్వచ్ఛ భారత్‌ తెలుసుకున్న అక్కడ సిబ్బంది చెత్త ఎక్కువగా ఉన్న ప్లేస్‌ను క్లీన్‌ చేయమని చెప్పడంతో... వెంటనే అతను యూనిట్‌కు ఫోన్‌ చేసి... చెత్త ఎక్కువగానూ, అసహ్యంగానూ వుండటంతో దాన్ని వాయిదా వేసుకోమని సలహా ఇచ్చాడు. ఇదీ స్వచ్ఛభారత్‌ తీరు...

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments