Webdunia - Bharat's app for daily news and videos

Install App

వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'కాంచన 2'... 'గంగ' విడుదలకు సిద్ధం..!

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (17:24 IST)
రాఘవ లారెన్స్ తాజా చిత్రం 'కాంచన 2' వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ హిట్ అయిన కాంచన సినిమాకి సీక్వెల్‌గా విడుదలైన 'కాంచన 2' సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగు వెర్షన్ 'గంగ' ఇంకా విడుదల కాలేదు. అయితే  తమిళంలో మాత్రం ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. 
 
పెద్ద హీరోల సినిమాలకి దీటుగా ఓపెనింగ్స్ వచ్చాయి. మాస్ ని విశేషంగా అలరించే ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా చూసుకోవడం ఈ చిత్రం హిట్టు‌కు మరో కారణంగా తెలుస్తోంది. కేవలం ఫస్ట్ హాఫ్ ఒక్కటి చాలు.. కలెక్షన్స్ రాబట్టడానికి అంటున్నారు సినీ ప్రముఖులు.
 
కాగా తమిళంలో వస్తున్న స్పందన చూసి తెలుగు బయ్యర్లు ఎక్సయిట్ అవుతున్నారు. ఇన్నాళ్లు ఆర్ధికంగా ఇబ్బందుల వలన వాయిదా పడిన 'గంగ'ను ఏ రోజైనా విడుదల చేసేయమని, ముహూర్తాల కోసం చూడొద్దని బయ్యర్లు చెబుతున్నారు. అంటే తమిళంలో ఈ చిత్రం ఏ స్థాయిలో వసూళ్లను కుమ్మరిస్తుందో ఆలోచించుకోండి. 
 
దీంతో వారంలోపు తెలుగులో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా విడుదల తేదీనలు ఖరారు చేయలేదని సమాచారం. మరి 'గంగ' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments