Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌.... నీకు అతనే దొరికాడా?

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (12:05 IST)
బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి తంతా అనే డైలాగు బాగా గుర్తుండే వుంటుంది. ఆ చిత్రం అనుకున్న రేంజ్ లో ఆడకపోవడం... ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్‌ల‌తో సాగుతుండటంతో ఎన్టీఆర్ కు అర్జెంటుగా ఓ క‌మ‌ర్షియ‌ల్ హిట్ కావాల్సి వచ్చింది. ఇమేజ్‌ని నిలబెట్టుకునేందుకు ప్రస్తుతం పూరి జ‌గ‌న్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌కి చాలా కీల‌కంగా మారిన ఈ చిత్రం ఎలా ఉంటుందో చెప్పలేం. ఐతే పూరీ చిత్రం అయితే బ్లాక్ బస్టర్ లేదంటే బోర్లా పడుతుంది.
 
ఇకపోతే దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సినిమా ఫ్లాప్‌లు కావడం విసిగిపోయి.. సక్సెస్ కోసం తపిస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు కథలనే కాకుండా నిర్మాతలను కూడా ఆచితూచి ఎంచుకుంటున్నాడు. 
 
ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తాజా సమాచారం. దీంతో ప్రస్తుతం దిల్ రాజు మంచి కథ కోసం వెతుకుతున్నాడట. ఈ ప్రాజక్టుకి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించే అవకాశం వుందని సమాచారం. 
 
ఎన్టీఆర్‌కి సూటయ్యే మంచి సబ్జెక్టు తయారుచేయమని భాస్కర్‌కు ఇప్పటికే దిల్ రాజు చెప్పినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇదిలా ఉంచితే, ఆ మధ్య దిల్ రాజు బ్యానర్లో ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments