Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్టులో బాలీవుడ్ నటికి తిప్పలు... ఆయుర్వేద పౌడర్‌పై అనుమానం!

Webdunia
గురువారం, 19 జూన్ 2014 (15:04 IST)
బాలీవుడ్ నటి రిచా చద్దాకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో చేదుఅనుభవం ఎదురైంది. ఆమెను విమానాశ్రయ భద్రతాధికారులు, కస్టమ్స్ అధికారులు రెండు గంటల పాటు ప్రశ్నించారు. రోజూ చేస్తున్న చెకింగ్‌లో భాగంగా రిచా చద్దా బ్యాకును కూడా ఎయిర్‌పోర్ట్ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఆమె బ్యాకులో ఓ పౌడర్ డబ్బా వారికి అనుమానం కలిగించడంతో వారు ఆమెను ప్రశ్నించారు.

ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు సంప్రదాయపద్దతుల్లో తయారైన ఆయుర్వేద పౌడర్ అని ఆమె అధికారులకు చెప్పినా వారిని అనుమానం వీడలేదట. నాకు ఆయుర్వేద వస్తువులపై నమ్మకం ఎక్కువ, ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిన ప్రతీసారి ఆయుర్వేద వస్తువులను వెంటతీసుకెళతానని, కానీ ఏనాడూ దీంతో ఇబ్బంది పడలేదు. ఈసారి అధికారులు నన్ను అడ్డుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆమె అన్నారు.

ఆ పౌడర్ డబ్బా ఓపెన్ చేస్తే నిల్వ చేయడం కష్టమని, అందుకే దానిని ఓపెన్ చేసేందుకు నిరాకరించానని తెలిపిన ఆమె, రెండు గంటల సేపు అధికారులకు దాని గురించి వివరించినా వారిని ఒప్పించలేకపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో దానిని తెరచి చూపేందుకు అంగీకరించానని తెలిపారు. ఇటీవల ఆమె 'గోలియోంకా రాస్ లీల రామ్ లీల' సినిమాలో దీపికా పదుకునేకు ఒదినగా నటించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments