Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 6న 'భాగ్యనగరం' చిత్రం విడుదల

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (20:44 IST)
కన్నడంలో ఘనవిజయం సాధించి 25 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించిన 'రాజధాని' చిత్రాన్ని సంతోష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై 'భాగ్యనగరం' అనే పేరుతో సంతోష్‌కుమార్‌ అనువదించారు. ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రకాష్‌రాజ్‌, యష్‌ హీరోగా, షీనా హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి కె.వి.రాజు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది. 

 
ఈ సందర్భంగా నిర్మాత సంతోష్‌కుమార్‌ చిత్ర విశేషాలను తెలుపుతూ... ''ఈ చిత్రం కన్నడంలో ఘనవిజయం సాధించి నిర్మాతకు 25 కోట్ల రూపాయలు కనకవర్షం కురిపించింది. ప్రముఖ కన్నడ దర్శకుడు కె.వి.రాజు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు కుర్రాళ్ళు తొందరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఏం చేసారు? దాని పర్యవసానం ఏమిటి? అనే ఇతివృత్తంతో మాస్‌, యాక్షన్‌ చిత్రంగా నిర్మించిన ఈ సినిమా తెలుగులో అంతకంటే ఎక్కువ విజయం సాధిస్తుందన్నారు. 
 
ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఇటీవల విడుదలయ్యాయి. పోలీసాఫీసర్‌గా ప్రకాష్‌రాజ్‌ నటన ఈ చిత్రానికి హైలైట్‌. హీరో హీరోయిన్‌తో పాటు ఇంకా ఈ సినిమాలో ముమైత్‌ఖాన్‌, తులసి, చేతన్‌చంద్ర, సత్య, సందీప్‌, రవితేజ, రమేష్‌ భరత్‌ల ఎక్స్‌లెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ కనబరిచారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నాం'' అని అన్నారు.
 
ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్య, కెమెరా: హెచ్‌సి వేణుగోపాల్‌, పాటలు: సత్య, లైన్‌ ప్రొడ్యూసర్‌: నయీమ్‌, నిర్మాత: సంతోష్‌కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.రాజు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments