Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోక్షజ్ఞ కోసం హీరో బాలకృష్ణ టైటిల్ రిజిస్టర్.. ఆ పేరేంటో తెలుసా?

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (12:43 IST)
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో తరం యువకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం కానున్నాడు. ఆ యువకుడే యువరత్న బాలకృష్ణ ఏకైక తనయుడు మోక్షజ్ఞ. ఈ యువకుడిని వెండితెరకు హీరోగా పరిచయం చేసేందుకు పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇలాంటి వారిలో సాయి కొర్రపాటి ముందు వరుసలో ఉన్నాడు. 
 
అయితే, హీరో బాలకృష్ణ మాత్రం తన కుమారుడి అరంగేట్రాన్ని సూపర్ డూపర్ హిట్ చిత్రంతో చేయించాలని కలలుగంటున్నారు. ఇందుకోసం ఆయన అందరికీ నచ్చేలా ఓ సినిమా టైటిల్‌ను ఎంపిక చేశారు. ఆ టైటిల్ పేరు "రానే వచ్చాడయ్యా ఆ రామయ్యా". ఈ టైటిల్‌ను రిజిస్టర్ కూడా చేయించాడు. ఈ టైటిల్‌ను వారాహి చలన చిత్ర బ్యానెర్‌పై నిర్మాత సాయి కొర్రపాటి రిజిస్టర్ చేశారు.
 
దీనిపై నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను వెండితెరకు హీరోగా పరిచయం చేసే అవకాశం తనకు కలగాలనేది తన కోరికని చెప్పారు. అందుకే, 'రానే వచ్చాడయ్యా ఆ రామయ్యా' అనే టైటిల్ని రిజిస్టర్ చేసినినట్టు నిర్మాత సాయి వెల్లడించారు. 
 
సాధారణంగా తాను టీవీలో వచ్చే సినిమా పాటలని బాగా పరిశీలిస్తాననీ, అలా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా పాట వింటుండగా ఈ 'రానే వచ్చాడయ్యా ఆ రామయ్య' టైటిల్ మోక్షజ్ఞకు బాగా సూటవుతుందని అనిపించిందనీ సాయి చెప్పారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన మిగతా విషయాలు బాలయ్య చెబుతారని ఆయన అన్నారు. గత కొన్నాళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్న సాయి కొర్రపాటి... మొత్తానికి బాలయ్య తనయుడిని హీరోగా పరిచయం చేసే సువర్ణావకాశాన్ని పొందారనే చెప్పుకోవచ్చు! 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments