Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిలకడగా బాలచందర్ ఆరోగ్యం.. ప్రముఖుల పరామర్శ..!

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (12:36 IST)
చెన్నై గరంలోని కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ దర్శకుడు కె.బాలచందర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వృద్ధ్యాప్య కారణాలతో ఆయన గత నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసింది. 
 
కాగా కిడ్నీ సమస్య మినహా మిగతా అన్ని అవయవాలు కుదుటపడినట్లు వైద్యులు మంగళవారం సాయంత్రం వెల్లడించారు. కిడ్నీలకు డయాలసిస్ చికిత్స అంది స్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడిం చారు. 
 
పలువురు సినీ ప్రముఖులు బాలచందర్‌ను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. డీఎంకే నేత స్టాలిన్, విజయకుమార్, నటి కె ఆర్ విజ య, రాజేష్, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ మొదలగు పలువురు కె.బాలచందర్‌ను పరామర్శించారు. కె ఆర్ విజయ బాలచందర్‌ను చూసి బోరున విలపించారు. కాగా విదేశాల్లో ఉన్న కమల్ హాసన్ ఆయనకు ఫోన్ చేసి పలకరించారు.  ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరాలని ఆకాంక్షించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments