Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రక్తం అతని దాహాన్ని తీరుస్తుంది'.. 'కాలకేయ' ఫస్ట్ లుక్.. రాజమౌళీ ట్వీట్స్..!

Webdunia
మంగళవారం, 12 మే 2015 (11:33 IST)
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, క్రియేటివ్ సంచలనం ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ సినిమా ప్రమోషన్‌ను అత్యంత వినూత్నంగా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ మే డే సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. మే 31న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. అప్పటివరకు వరుసగా చిత్రంలోని పాత్రలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాకు పబ్లిసిటీ కల్పించాలని ప్లాన్ చేశారు. 
 
తాజాగా బాహుబలిలోని మరో కీలక పాత్ర 'కాలకేయ' పోస్టర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళీ తన ట్విట్టర్‌లో 'రక్తం అతని దాహాన్ని తీరుస్తుంది. హింస అతణ్ని శాంతపరుస్తుంది... అతడే లక్ష మంది ఆటవిక ప్రజల నాయకుడు కాలకేయ'.. అంటూ ట్వీట్ చేశారు.

ఈ పోస్టర్‌లో కాలకేయునిగా ప్రభాకర్ (మర్యాద రామన్న ఫేమ్) నటిస్తున్నాడు. ఇందులో ఓ చేతిలో చెక్క త్రిశూలం, శరీరానికి మందమైన చెక్క కవచం, ముఖానికి కత్తి గాట్లు, మసికొట్టుకుపోయిన శరీరంతో చూడగానే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది 'కాలకేయ' ఫస్ట్ లుక్. 
 
చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తొలుత బాల బాహుబలిని రిలీజ్ చేశారు. ఆ తర్వాత శివలింగాన్ని మోస్తున్న ప్రభాస్‌ లుక్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అనంతరం మాసిన చీరతో, చేతికి సంకెళ్ళు, విరబోసుకున్న జుట్టుతో ఉన్న అనుష్క పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా బాహుబలిలో రమ్యకృష్ణ పోషిస్తున్న శివగామి పోస్టర్‌ను ట్విట్టర్లో విడుదల చేశారు. 
 
కాగా రెండు భాగాలుగా తెరకెక్కనున్న 'బాహుబలి‌' తొలి భాగాన్ని 'బాహుబలి ది బిగినింగ్‌'గా పిలుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. తొలుత ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే పోస్ట్‌ప్రొడక్షన్ పనులు..విజువల్ గ్రాఫిక్స్ పనిలో ఆలస్యం చోటుచేసుకోవడంతో ఈ చిత్రాన్ని జూలై 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments