Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్తీ అగర్వాల్ అయితే కరెక్టుగా సరిపోతుందని అమెరికా నుంచి పిలిపించారట...

Webdunia
సోమవారం, 8 సెప్టెంబరు 2014 (19:23 IST)
భరత్‌ పారేపల్లి దర్శకత్వంలో టైమ్‌ మీడియా కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఖాన్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌ కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, బెంగాలీ, భోజ్‌పూరి భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యసన్నివేశాలను అన్నపూర్ణ ఫారెస్ట్‌ లొకేషన్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ఇప్పటివరకు 30 చిత్రాలు చేశాను. కానీ ఈ చిత్రం మంచి బ్రేక్‌ ఇస్తుందనే నమ్మకముంది. చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. ఇక్కడే రెండు రోజులపాటు సన్నివేశాల చిత్రీకరణ తర్వాత ఒక సాంగ్‌ను తీయబోతున్నాం. దీంతో చిత్రం పూర్తవుతుంది. 
 
బాలీవుడ్‌లో పలు చిత్రాలు తీసిన టైమ్‌ మీడియా కమ్యూనికేషన్‌తో కలిసి సినిమా చేయడం ఆనందంగా వుంది. నేను చెప్పిన కథ నిర్మాత రెహమాన్‌గారికి నచ్చడంతో ఈ సినిమా కార్యరూపం దాల్చింది. ఇందులో రాహుల్‌దేవ్‌ సోదరుడు ముకుల్‌ దేవ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఒక నక్సలైట్‌గా ఆయన పాత్ర వుంటుంది. ఆర్తీ అగర్వాల్‌ అమాయకపు అమ్మాయిగా కన్పిస్తుంది. ఈ పాత్రకు ఆమెనే కరెక్ట్‌ అని అమెరికా నుంచి పిలిపించి నటింపజేశాం. పోసాని దళ నాయకుడిగా నటిస్తున్నాడు. ఆదిత్యఓం కూడా మరో హీరో అని చెప్పారు.
 
నిర్మాత ఎస్‌ఎ. రహమాన్‌ తెలుపుతూ... ఈనెల 23 నుంచి మూడురోజులపాటు ముంబైలో ఓ ఐటంసాగ్‌ తీయబోతున్నాం. దాంతో షూటింగ్‌ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్‌ 21న చిత్రం ఆడియోను ముంబైలో విడుదలచేసి, సినిమాను నవంబర్‌ 1న విడుదల చేస్తున్నాం అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: కొమ్మనాపల్లి గణపతిరావు, సంగీతం: రాజ్‌సేన్‌, కెమెరా: ఆళ్ళ రాంబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్‌ పారేపల్లి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments