Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథలా వచ్చా.. అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటున్నా : అర్పిత

Webdunia
మంగళవారం, 18 నవంబరు 2014 (19:06 IST)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటికి అనాథలా వచ్చానని ఇపుడు ఒక యువరాణికి జరిగినట్టుగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటున్నట్టు సల్మాన్ ఖాన్ దత్తత సోదరి అర్పితా ఖాన్ చెప్పుకొచ్చింది. వాస్తవానికి అర్పిత ఈ బాలీవుడ్ హీరో రక్త సంబంధంతో కూడిన సోదరి కాదు. 
 
ఆమె కొన్ని విషాదకర పరిస్థితుల నేపథ్యంలో సల్మాన్ కుటుంబంలోకి ప్రవేశించింది. కొన్నేళ్ల క్రితం అర్పిత తల్లి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. అర్పిత అప్పటికి చిన్నపిల్ల. తల్లి మరణించడంతో, అర్పిత రోడ్డుపై దీనంగా కనిపించింది. దీంతో, ఆ చిన్నారి పరిస్థితి చూసి సల్మాన్ తండ్రి, ప్రసిద్ధ రచయిత సలీం ఖాన్ చలించిపోయారు. 
 
వెంటనే ఆమెను ఇంటికి తీసుకువచ్చి దత్తత చేసుకున్నారు. అర్పితను కన్నబిడ్డ కంటే మిన్నగా చూశారు సలీం ఖాన్ దంపతులు. ఆయన కుమారులు సల్మాన్, అర్బాజ్, సొహెయిల్ కూడా అర్పితపై విపరీతమైన మమకారం పెంచుకున్నారు. ఇప్పుడు తన మనసుకు నచ్చినవాడితో ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించడం చూస్తుంటేనే అర్థమవుతోంది అర్పితపై వారికెంత ప్రేమ ఉందో. 
 
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగుతున్న పెళ్లి వేడుక ఖర్చు రూ.2 కోట్లు కాగా, బంగారు చెల్లికి సల్మాన్ ముంబై కార్టర్ రోడ్డులో రూ.16 కోట్ల విలువైన ఫ్లాట్ బహుమతిగా ఇచ్చాడట. అర్పిత అదృష్టం అనడం కంటే, ఇదంతా సల్మాన్ కుటుంబం గొప్పదనంగానే చెప్పుకోవాలి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments