Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైజ్ జీరో'‌లో అనుష్క డ్యూయల్ రోల్... గెస్ట్‌గానే శ్రుతి..!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (13:04 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీలు అనుష్క, శ్రుతి హాసన్‌లో ఒకే చిత్రంలో నటిస్తున్నారు. అయితే అందులో అనుష్క డ్యూయల్ రోల్‌లో అలరించనుండగా, శ్రుతి మాత్రం గెస్ట్‌ పాత్రలో కనిపిస్తుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ సినిమా సంస్థ ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మాతగా అనుష్క ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'సైజ్‌ జీరో' అనే పేరు పెట్టారు.
 
ఈ చిత్రం సోమవారంనాడు లాంఛనంగా హైదరాబాద్‌లోని పివిపి సంస్థ ఆఫీస్‌లో ప్రారంభమైంది. ముహర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా పివిపి సతీమణి ఝాన్సీ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కణిక థిల్లాన్‌ కొవెలమూడి క్లాప్‌ కొట్టారు. డిఫరెంట్‌ కథాంశాలతో సినిమాలను నిర్మించి  తెలుగు ప్రేక్షకుల్లో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న పివిపి నిర్మాణ సంస్థ రొమాంటిక్‌ కామెడి కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 
 
ఈ చిత్రంలో అనుష్క, ఆర్య, భరత్‌, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. గ్లామరస్‌ హీరోయిన్‌ శృతిహాసన్‌ ఇందులో గెస్ట్‌ అప్పియరెన్స్‌ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. 
 
అనుష్క, ఆర్య, భరత్‌, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, కథ-స్క్రీన్‌ప్లే: కణిక ధిల్లాన్‌ కొవెలమూడి, ఎగ్జిక్టూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్‌ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్‌ కొవెలమూడి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments