Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్‌హెచ్ 10'తో అనుష్కకు వెన్నునొప్పి... మరి విరాట్ కోహ్లీతో లింకేంటి!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (15:51 IST)
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మకు వెన్నునొప్పి (బ్యాక్ పెయిన్). ఈ నొప్పికి భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మీడియా లింకు పెట్టింది. విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకే ఆస్ట్రేలియాకు వెళ్లడం వల్లే అనుష్క శర్మకు వెన్ను నొప్పి వచ్చిందని మీడియా కథనాలు రాసింది. దీనిపై ఈ ముద్దుగుమ్మ మండిపడింది. 
 
‘ఊహాగానాలకు ఓ హద్దంటూ ఉండాలి. అయినా నా బ్యాక్ పెయిన్‌కు, ఆస్ట్రేలియా టూర్‌కు ఏమిటీ సంబంధం? ఎన్‌హెచ్ 10 సినిమా షూటింగ్ సందర్భంగా బ్యాక్ పెయిన్ మొదలైంది. తీరిక లేక చూపించుకోలేదు. ఇప్పుడు ఆ పెయిన్ మరింత పెరిగిపోవడంతో ఆస్పత్రికి వెళ్లాను. దీనిపై ఊహాగానాలు అల్లడం బాధిస్తోంది’ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ ఆవేదన వ్యక్తం చేసింది. 
 
అంతేకాకుండా, విరాట్ ఆటను చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్లడంతోనే తనకు బ్యాక్ పెయిన్ వచ్చిందన్న వదంతులపై ఆమె విస్మయం వ్యక్తం చేసింది. ‘కోహ్లీతో బంధాన్ని నేనేం దాయలేదుగా, కోహ్లీతో కలిసి బయటకు వచ్చినప్పుడు ఫొటోలు తీస్తున్నా, ఏమీ అనడం లేదు. అయినా మా బంధంపై లేనిపోని రాద్ధాంతం చేయడం భావ్యం కాదు’ అని ఆమె వాపోయింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments