Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతాంజలి సీక్వెల్‌లో అంజలి లేదట.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (12:21 IST)
అంజలి కథానాయికగా ఇటీవల వచ్చిన 'గీతాంజలి' చిత్రం విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న సంగతి విదితమే. ఇప్పుడు దీనికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి కూడా 'గీతాంజలి' దర్శకుడు రాజ్ కిరణే దర్శకుడైనప్పటికీ, నిర్మాత మాత్రం మారాడు.
 
క్రేజీ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చినబాబు దీనిని నిర్మిస్తున్నారు. దీని గురించి నిర్మాత చెబుతూ, "గీతాంజలి చిత్రం నాకెంతో నచ్చి ఆ దర్శకుడు రాజ్ కిరణ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాను. అయితే, వేరే కథతో కాకుండా 'గీతాంజలి' కథతోనే చేయాలనుకున్నాను. ఈ సీక్వెల్ కి రాజ్ కిరణ్ కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ కథానాయిక, కథానాయకుడు ఇందులో నటిస్తారు" అన్నారు. దీనికి వెలిగొండ శ్రీనివాస్ డైలాగులు రాస్తున్నాడు.
 
ఇకపోతే.. గీతాంజలిలో అంజలిని తీసుకోకూడదని నిర్మాత నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. గీతాంజ‌లికి రూ.40 ల‌క్ష‌లు అందుకొన్న అంజ‌లి, ఇప్పుడు తన రేంజ్ పెరిగిందని 75లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఆ డ‌బ్బుతో సినిమానే తీసేయొచ్చ‌నని.. ఈ క్రమంలో అంజ‌లిని ప‌క్క‌న పెట్టేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments