బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన తండ్రి కోసం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నారు. అందుకోసం ఆయన తండ్రి దివంగత హరివంశ్ రాయ్ బచ్చన్‌కు సంబంధించిన వివరాలు ఉంటే తనకు పంపించాలని వేడుకుంటున్నారు. ఈ విషయం గురించి అమితాబ్ ట్విట్టర్‌లో ప్రకటించారు. అందులో.. సుప్రసిద్ధ కవిగా పేరుగాంచిన డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్‌కు సంబంధించిన వివరాలు, ఫొటోలు ఫ్యాన్స్ వద్ద ఉంటే తనతో పంచుకోవాల్సిందిగా బిగ్ బి కోరారు.
నేనొక సమగ్రమైన వెబ్‌సైట్‌ను ప్రారంభించదలచుకున్నాను. సరైన సమాచారం ఇవ్వడమే దాని వెనుకున్న ఉద్దేశం. చాలా సైట్లు ఆయన గురించి సరైన సమాచారం అందివ్వడంలేదు. ప్రస్తుతం నా తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్‌కు సంబంధించిన సమాచారం, వివరాలు, ఫొటోలు సేకరిస్తున్నాను. మీ వద్ద ఆయనకు సంబంధించిన సమాచారం, లేఖలు, సంభాషణల తాలూకు ప్రతులు, కవితలు, కథలు, ప్రసంగాలు ఉంటే దయచేసి తనకు మెయిల్ చేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా కోరారు.