Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీ ఇంటిని పుణ్యక్షేత్రంగా భావిస్తున్నా: అమితాబ్ బచ్చన్

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (18:52 IST)
కల్యాణ్ జ్యుయెల్లరీ షాపు ఓపెనింగ్ సెర్మనీ తమిళనాడులోని చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఏప్రిల్ 17న చెన్నై వెళ్లారు. అప్పుడప్పుడూ సినిమా షూటింగులు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అక్కడికే వెళ్లే ఆయన ఈసారి మాత్రం చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఇందుకు ప్రధాన కారణం నాటితరం లెజండరీ నటుడు శివాజీ గణేశన్ ఇంటిని సందర్శించడమే! అంతేకాదు, తమిళులు తనపై చూపిన అభిమానానికి బిగ్ బీ ముగ్దుడైపోయారట. 
 
"సినిమాల కోసం గత 40 ఏళ్లుగా నేను చెన్నై వస్తూనే ఉన్నా. శివాజీ గారు నటించిన ఓ తమిళ చిత్రానికి రీమేక్‌గా రూపొందించే హిందీ సినిమా షూటింగ్ కోసం డబ్బయవ దశకంలో మొదటిసారి ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి నేను శివాజీ సర్‌కు గొప్ప అభిమానిని" అని బిగ్ బి తెలిపారు. ఈ క్రమంలో ఈసారి టీ నగర్‌లోని శివాజీ గణేశన్ ఇంటిని కూడా అమితాబ్ సందర్శించారు. అంతేకాదు, ఆయన కుమారుడు, నటుడు ప్రభు, ఆయన కుటుంబ సభ్యులతో కలసి విందు కూడా చేశారు.
 
అందుకుగానూ ప్రభుకు కృతజ్ఞతలు తెలిపిన బిగ్ బి, "గతంలో ఈ ఇంట్లో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. కానీ ఈరోజు ఈ ఇంటిని సందర్శించడం నాకు గౌరవంగా ఉంది. దీనిని నేను ఓ పుణ్యక్షేత్రంలా భావిస్తున్నా" అని పేర్కొన్నారు. అభిమానులందరికీ అమితాబ్ ధన్యవాదాలు తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments