Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అల్లుడు శీను' 63 కేంద్రాల్లో 50 రోజులు

Webdunia
శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (18:12 IST)
సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో బెల్లంకొండ శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించిన భారీ చిత్రం 'అల్లుడు శీను' 63 కేంద్రాల్లో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది.
 
ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''నా తొలి చిత్రాన్ని ఇంత బాగా ఆదరించి అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నాకు ఇంత పెద్ద హిట్‌ ఇచ్చిన వి.వి.వినాయక్‌గారికి స్పెషల్‌ థాంక్స్‌ చెప్తున్నాను. నాన్నగారు ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించి హీరోగా నన్ను చాలా పెద్ద లెవెల్‌లో లాంచ్‌ చేసారు. వినాయక్‌గారి టేకింగ్‌, నాన్నగారి మేకింగ్‌ 'అల్లుడు శీను'ని పెద్ద రేంజ్‌కు తీసుకెళ్లాయి. 
 
ఈ చిత్రంలో నటించిన నటీనటులకు ముఖ్యంగా సమంత, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందంగార్లకు, స్పెషల్‌ సాంగ్‌ చేసిన తమన్నాకు అందరికీ నా థాంక్స్‌. అలాగే దేవిశ్రీ ప్రసాద్‌, ఛోటా కె.నాయుడు, గౌతంరాజు, బాబీ, కోన వెంకట్‌, గోపీ మోహన్‌, ఎ.ఎస్‌.ప్రకాష్‌ లాంటి పెద్ద టెక్నీషియన్స్‌ ఈ చిత్రం  ఇంత మంచి హిట్‌ అవడానికి కారణం అయ్యారు. నా తొలి చిత్రం 63 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం జరుపుకోవడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు. 
 
సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ - ''బెల్లంకొండ సురేష్‌గారి అబ్బాయి బెల్లంకొండ శ్రీనివాస్‌తో నేను డైరెక్ట్‌ చేసిన 'అల్లుడు శీను' కమర్షియల్‌గా పెద్ద హిట్‌ అయి 50 రోజులు పూర్తి చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. తప్పకుండా శ్రీనివాస్‌ ముందు ముందు మరిన్ని ఘనవిజయాలు సాధించి హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాడు. 'అల్లుడు శీను'ని సూపర్‌హిట్‌ చేసి బెల్లంకొండ శ్రీనివాస్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments