Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు వారి వారసుడు అల్లు అయాన్ ఫస్ట్ లుక్... అల్లు అర్జున్ ముద్దులతో...

అల్లు అభిమానులకు పండగే...

Webdunia
శనివారం, 19 జులై 2014 (18:06 IST)
తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హాస్యనటుడు పద్మశ్రీ డా.అల్లురామలింగయ్య గారు ఎన్నో వందల చిత్రాల్లో నటించి నవ్వుకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా పరిచయమై ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ సినిమాలు నిర్మిస్తూ తన నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టను భారతదేశమంతా చాటిచెప్పారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. 
 
అల్లు వారి నట వారసుడిగా పరిచయమై తన స్టైలిష్ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్టైలిష్ స్టార్‌గా చిరస్థాయిగా నిలబడిన శ్రీ అల్లు అర్జున్ గారు ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. శ్రీ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ముద్దుల తనయుడి పేరు అల్లు అయాన్. 
 
అభిమానులతో పాటు మీడియా కూడా అయాన్‌ని చూసేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. రేసుగుర్రం ఆల్ టైం రికార్డ్స్‌లో టాప్ 4 చిత్రంగా నిలబడడంతో అభిమానులు పండగ చేసుకుంటున్న సందర్భంలో హీరో అల్లు అర్జున్ మెగాభిమానులకు స్పెషల్ గిఫ్ట్‌గా అయాన్ ఫొటోను విడుదల చేశారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments