Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రంక్ అండ్ డ్రైవ్.. తప్పుడు ప్రచారం చేశారు: అల్లు అర్జున్ ఆవేదన

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (18:06 IST)
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై దుష్ప్రచారం చేశారని సినీ నటుడు అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశాడు. బ్రీత్ అనలైజర్‌ పరీక్షలో మద్యం సేవించలేదని తేలిందని అల్లు అర్జున్ అన్నాడు. అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా బంజారాహిల్స్ పోలీసులు తనపై బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరిపిన ఉందంతంపై స్పందించాడు. 
 
జరిగింది వేరు... మీడియాలో వచ్చింది వేరని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, జరిగిన విషయాన్ని వివరించాడు. అర్ధరాత్రి సమయంలో బ్రీత్ అనలైజర్‌లో ఊదమని పోలీసులు అడిగారని చెప్పాడు. 
 
మీడియా కెమెరాలు ఉన్నాయని... వారిముందు తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందని తెలిపానని... దీంతో మీడియా వారిని పోలీసులు పక్కకు తీసుకెళ్లారని అల్లు అర్జున్ తెలిపాడు. ఆ తర్వాత బ్రీత్ అనలైజర్ పరీక్ష జరిగిందని... తాను మద్యం సేవించలేదని పరీక్షలో తేలిందని స్పష్టం చేశాడు.
 
మద్యం సేవించి నడిపే వారిని హైదరాబాదు పోలీసులు వదలరని... తగిన చర్యలు తీసుకోవడమో లేదా జరిమానా విధించడమో చేస్తారని చెప్పాడు. ఈ విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా... డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అల్లు అర్జున్ అంటూ పలు వెబ్ సైట్లలో వీడియోలను పోస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఒక వేళ తాను మద్యం సేవించినట్టైతే.. నడిచి వెళ్లడమో, మరొకరిని డ్రాప్ చేయమని అడగడమో, ట్యాక్సీ లేదా ఆటోలో వెళ్లడమో చేసేవాడినని చెప్పాడు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments