Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకవేళ తాగివుంటే.. మరొకరిని డ్రాప్ చేయమంటా!

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (16:42 IST)
బ్రీత్ అనలైజర్‌ పరీక్షలో మద్యం సేవించలేదని తేలిందని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నాడు. అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా బంజారాహిల్స్ పోలీసులు తనపై బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరిపిన ఉందంతంపై స్పందించాడు. 
 
జరిగింది వేరు... మీడియాలో వచ్చింది వేరని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, జరిగిన విషయాన్ని వివరించాడు. అర్ధరాత్రి సమయంలో బ్రీత్ అనలైజర్‌లో ఊదమని పోలీసులు అడిగారని చెప్పాడు. 
 
మీడియా కెమెరాలు ఉన్నాయని... వారిముందు తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందని తెలిపానని... దీంతో మీడియా వారిని పోలీసులు పక్కకు తీసుకెళ్లారని అల్లు అర్జున్ తెలిపాడు. ఆ తర్వాత బ్రీత్ అనలైజర్ పరీక్ష జరిగిందని... తాను మద్యం సేవించలేదని పరీక్షలో తేలిందని స్పష్టం చేశాడు.
 
మద్యం సేవించి నడిపే వారిని హైదరాబాదు పోలీసులు వదలరని... తగిన చర్యలు తీసుకోవడమో లేదా జరిమానా విధించడమో చేస్తారని చెప్పాడు. ఈ విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా... డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అల్లు అర్జున్ అంటూ పలు వెబ్ సైట్లలో వీడియోలను పోస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఒక వేళ తాను మద్యం సేవించినట్టైతే.. నడిచి వెళ్లడమో, మరొకరిని డ్రాప్ చేయమని అడగడమో, ట్యాక్సీ లేదా ఆటోలో వెళ్లడమో చేసేవాడినని చెప్పాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments