Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యారాయ్‌ని నిరాశపరిచిన మణిరత్నం: రీ ఎంట్రీకి రెడీ!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (17:06 IST)
1997లో రిలీజ్ అయిన మణిరత్నం ఇరువర్ అనే తమిళ సినిమా ద్వారా దక్షిణాదిన కాలుమోపిన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్.. తర్వాత బాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే అగ్రనాయికగా రాణించింది. 
 
గర్భం ధరించేవరకు టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఐష్.. పాప పుట్టాక మాత్రం సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం పాప పెరగడంతో తిరిగి సినిమాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. సినిమాల్లో తన రీ ఎంట్రీ కూడా మణిరత్నం చిత్రంతోనే ఇవ్వాలని ఐష్ ఆశపడింది. కానీ నిరాశే మిగిలింది. 
 
గతంలో మణిరత్నం దర్శకత్వం వహించే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నాగార్జున మల్టీస్టారర్ సినిమాలో ఐష్ నటించనున్నట్లు వార్తలొచ్చాయి. అయితే మణిరత్నం మహేష్.. నాగార్జున సినిమా నుంచి డ్రాప్ కావడంతో ఐష్‌కు నిరాశే మిగిలింది. 
 
కాగా మణిరత్నం ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా కొత్త సినిమా చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంకేముంది.. మణిరత్నం సినిమాలో నటించలేకపోయాననే బాధతోనే ఐష్.. సంజయ్ గుప్తా సినిమాకు ఓకే చెప్పేసింది. ఈ సినిమా షూటింగ్ డిసెంబరులో  ప్రారంభం కానుంది.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments