Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో 'సన్నాఫ్ సత్యమూర్తి'... ఏప్రిల్ 24న విడుదల..!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (15:39 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి తెలుగులోనేకాక మలయాళంలో కూడా మంచి పేరుంది. ఇక్కడ ఉన్నట్టుగానే కేరళలో కూడా పెద్ద సంఖ్యలో బన్నీకి అభిమానులున్నారు. దీంతో తెలుగులో విడుదలైయ్యే ప్రతి సినిమాను ఆయన మలయాళంలో డబ్బింగ్ చేసి అక్కడ విడుదల చేస్తుంటారు.

 
తాజాగా అల్లు అర్జున్ నటించిన 'సన్నాన్ సత్యమూర్తి' సూపర్ హిట్టు కొట్టి, వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని కూడా మలయాళంలోకి డబ్బింగ్ చేస్తున్నారు. త్వరలో డబ్బింగ్ పనులను పూర్తి చేసి ఏప్రిల్ 24వ తేదిన మలయాళంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
 
మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా 'సన్నాఫ్ సత్యమూర్తి' పేరుతోనే విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు, ట్రైలర్స్‌కి అక్కడ భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమాకి ఎటువంటి విజయం అందుతుందో త్వరలో తెలియనుంది. 
 
కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యామీనన్, ఆదా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత ఎస్ రాధాకృష్ణ నిర్మించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments