Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న "వీడు మనవాడే"

Webdunia
WD
" కిక్" శ్యామ్ హీరోగా మల్లికాకపూర్ హీరోయిన్‌గా "వీడు మనవాడే" చిత్రం రూపొందుతోంది. అన్నం ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నేతాజీ దర్శకత్వంలో సి. విజయకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సారథి స్టూడియోలో జరుగుతోంది.

తాజా షెడ్యూల్‌ను ఈ నెలాఖరు వరకు జరుపుతామని దర్శకుడు నేతాజీ చెప్పారు. ఈ చిత్రం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. తమిళంలో మరొక చిత్రం అంగీకరించడంతో ఆ చిత్రానికి పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కులుమనాలి, చెన్నై, మహాబళేశ్వరం తదితర ప్రాంతాల్లో చిత్రీకరించామని చెప్పారు.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం తమిళంలో ఇటీవలే విడుదలైందని, తెలుగు వర్షన్ నేటివిటీకి తగినట్లు మళ్లీ షూటింగ్ చేస్తున్నామని దర్శకుడు పేర్కొన్నారు.

హీరో శ్యామ్ మాట్లాడుతూ.. తాను ఇందులో చేపలు పట్టే వ్యక్తిగా నటిస్తున్నానని చెప్పారు. ఈ చిత్రం ద్వారా తనకు మంచి గుర్తింపు వస్తుందని శ్యామ్ ఆశించారు. ఇందులో విజయభాస్కర్ బ్లైండ్ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

ఇంకా రామిరెడ్డి, సైరాభాను, వేణుమాధవ్, రంగనాథ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: గాదిరాజు శ్రీనివాస్, మాటలు: లతా నేతాజీ, ఫైట్స్: ఆనంద్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారు.. పవన్ సీరియస్

కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్

AP Cabinet: మే 20న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం

హనీట్రాప్ వివాదంలో పాక్ దౌత్యవేత్త... అమ్మాయితో అశ్లీల వీడియో

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Show comments