Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకలు జరుపుకున్న 'సీమటపాకాయ్‌'

Webdunia
అల్లరినరేష్‌, పూర్ణ జంటగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సీమటపాకాయ్‌' వీడు చాలా హాట్‌ ఉపశీర్షిక. డ ా|| మళ్ళ విజయప్రసాద్‌ నిర్మాత. వెల్ఫేర్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం యొక్క ఆడియో 'మధుర' ఆడియో ద్వారా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతాన్ని సమకూర్చిన ఈ ఆడియో ప్లాటినమ్‌ డిస్క్‌లోకి ఎంటరయ్యింది. ఈ ప్లాటినమ్‌ డిస్క్‌ కార్యక్రమాలు ఇటీవల వైజాగ్‌లోని 'గురజాడ' కళాక్షేత్రంలో సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగాయి

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాటినమ్‌ డిస్క్‌ మెమొంటోలు అందుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేస్‌, హీరోయిన్‌ పూర్ణ, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి, నిర్మాత డా. మళ్ళ విజయప్రసాద్‌, వందేమాతరం శ్రీనివాస్‌, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్‌, వెల్ఫేర్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మళ్ళ అరుణకుమారి, వెల్ఫేర్‌ గ్రూప్‌ ప్రతినిధి ఎ. శ్రీనివాసరావు మరియు యూనిట్‌ సభ్యులు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో ముందుగా ప్రముఖ గాయకుడు బాబాసెహగల్‌ చేసిన సంగీత విభావరి నగరవాసులను అలరించింది. తరువాత మెమొంటోల ప్రధానోత్సవం అనంతరం హీరో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ...'మా సీమ టపాకాయ్‌' అతి త్వరలోనే ప్లాటినమ్‌ డిస్క్‌లోకి ఎంటరవ్వడం చాలా సంతోషంగా వుంది. అన్ని అంశాలు మిళితమై అన్ని హంగులతో రెడీగా వున్న ఈ 'సీమటపాకాయ్‌'గట్టిగా పేలడానికి రెడీగా వుంది. మీరు రెడీగా వుండండి' అన్నారు.

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ...'వెల్ఫేర్‌క్రియేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మీ అందరికీ కన్నుల విందు చేయనుంది. వందేమాతరం అందించిన పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. సినిమా కూడా సూపర్‌హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను' అన్నారు.

వందేమాతరం శ్రీనివాస్‌ మాట్లాడుతూ....'ఈ చిత్రం ప్లాటినమ్‌ డిస్క్‌ జరుపుకోవడం చాలా సంతోషంగా వుంది. దర్శకుడు నాగేశ్వరరెడ్డి సినిమాలో పాటలు అనగానే హిట్‌ అయినట్లే అతనికి చిత్రం పట్ల, పాటల పట్ల మంచి అవగాహన ఉంది' అన్నారు.

నిర్మాత డ ా|| మళ్ళ విజయప్రసాద్‌ మాట్లాడుతూ...'మా సంస్థలో వస్తున్న మూడవ చిత్రం 'సీమ టపాకాయ్‌'. ఆడియో ఘన విజయం సాదించి ప్లాటినమ్‌ డిస్క్‌ జరుపుకోవడం సంతోషంగా వుంది. వందేమాతరం శ్రీనివాస్‌ అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి చాలా అందంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని 'మే' ప్రధమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మీ అందరికీ నచ్చుతందనే ఆశిస్తున్నాను' అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

Show comments