ప్రియాంకా చాబ్రా బికినీలో కనిపించదట... మరి ఛాన్సులొస్తాయా...?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2013 (18:54 IST)
FILE
పదిహేనేళ్ళ వయసు నుండి నటనారంగంలో నాకున్న ఆసక్తి, పలు టీవీ సీరియళ్ళలో నటించిన అనుభవంతో నటిగా తెలుగు సినిమాలో నటించే అవకాశం పొందాను అంది నటి ప్రియాంక చాబ్రా. వెన్నెల కిశోర్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'అతడు.. ఆమె.. ఓ స్కూటర్‌' చిత్రంతో నటిగా పరిచయమవుతుంది. గంగారపు లక్ష్మణ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముత్తు కుమార్‌స్వామి సమర్పణలో పిరమిడ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై అమరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. నటిగా తొలి సినిమా పట్ల తన అనుభవాల్ని పాత్రికేయులతో పంచుకున్నారు.

ఆ విషయాలు ఆమె మాటల్లో... 'మాది ముంబాయి. స్వతహాగా మోడల్‌ని అయిన నేను.. జీ సంస్థ వారు నిర్మించిన ఓ చారిత్రాత్మక సీరియల్‌ ద్వారా యువరాణి పాత్రలో బుల్లితెర ఆరంగేట్రం చేసాను. 14 ఏళ్ల వయస్సులోనే నగేష్‌ బోస్లేగారి వద్ద థియేటర్స్‌లో శిక్షణ పొందిన నాకు.. కెమెరా భయం అస్సలు లేదు. ఇక 'అతడు.. ఆమె.. ఓ స్కూటర్‌' చిత్రం కోసం మొదట నన్ను కలిసింది.. చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌.

నాకు కథ చెప్పి.. ఈ చిత్రంలో నన్ను నటింపజేసి, నా నుంచి చక్కని అభినయాన్ని రాబట్టుకున్నారు. చిత్ర నిర్మాత అమరేంద్రగారు నన్ను వారి కుటుంబ సభ్యురాలిలాగే ఆదరించి.. షూటింగ్‌ జరిగిననాళ్లూ నన్ను ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకున్నారు. వెన్నెల కిషోర్‌గారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన సెట్‌లో అందరితో కలివిడిగా ఉంటూ.. అందర్నీ చాలా బాగా నవ్వించేవారు. ఈ సినిమాతో నాకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభిస్తుందనే నమ్మకం ఉంది. ఇటీవలే షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఇక్కడి టెక్నీషియన్లు వారి పనితనం డెడికేటింగ్‌ నాకు బాగా నచ్చాయి. తెలుగు లాంగ్వేజ్‌ రానప్పటికీ నాకు మా టీమంతా సహకరించారు.

రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది. ఈ చిత్రంలో సిటీ అమ్మాయిగా బబ్లీగా, ప్రెటీగా కనిపిస్తాను. నాకొక మంచి ఎక్స్‌పిరియన్స్‌నిచ్చిందీ చిత్రం. ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందంటే, గతంలో థియేటర్‌ ఆర్టిస్‌గా నాకున్న అనుభవం, నా ఫోట్‌ షూట్స్‌ చూసి వెన్నెల కిశోర్‌ కాంటాక్ట్‌ చేశారు. ఆ విధంగా ఈ సినిమాలో అవకాశం పొందాను. మంచి టీమ్‌తో పనిచేసినందుకు ఆనందంగా ఉంది. దర్శకుడు బాగా తెరకెక్కించారు.

తెలుగులో నటిగా స్థిరపడాలన్నదే నా ఆశయం. నా తదుపరి చిత్రానికి నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటాను. పాత్ర కోసం గ్లామరస్‌గా కనిపించడానికి నేను అడ్డు చెప్పను.. కానీ, అనవసరమైన అందాల ప్రదర్శన అంటే నాకు ఇష్టం ఉండదు'. బికినీ వంటి దుస్తులతో కనిపించను అంటూ తన అభిమతాన్ని వ్యక్త పరిచింది. తెలుగులో మగధీర, ఈగ చిత్రాలంటే ఇష్టమని చివరిగా తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకి ఇచ్చిన ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమేరా పెట్టిన యజమాని, అరెస్ట్

అమరావతిలో నాలుగు స్టార్ హోటళ్లు : కొత్త టూరిజం పాలసీ

గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి

నిమ్స్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతైన వైమానిక శక్తిగా భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

Show comments