Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాతకాలపు అనుభవాల దొంతర "అతడు ఆమె ఓ స్కూటర్‌"

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2012 (21:01 IST)
WD
పాతకాలం నాటి భావాలు గల వ్యక్తి ఇప్పటి హైటెక్‌ యుగంలో తన పెండ్లి కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు ఏమిటనేది ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కిస్తున్నట్లు 'అతడు ఆమె ఓ స్కూటర్‌' చిత్రం గురించి దర్శకుడు గంగారపు లక్ష్మణ్‌ తెలియజేశారు.

పిరమిడ్‌ క్రియేషన్స్‌ పతాకంపై అమరేంద్రరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెలకిషోర్‌, ప్రియాంక చాబ్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ, ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందే ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌ అద్బుతంగా నటించాడు. కథ రీత్యా ఆయన పాత్ర చాలా సూటయింది. ప్రస్తుతం టాకీ పూర్తయింది. నవంబర్‌ 7నుంచి ఫిలింసిటీలో పాటలను చిత్రీకరిస్తున్నాం. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

కిషోర్‌ మాట్లాడుతూ, ఈ చిత్ర కథ వినకముందు హీరోగా చేయడం అవసరమా! అనిపించింది. దర్శకుడు కథను మార్చిన విధానం చాలా ఉత్కంఠను కల్గించింది. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

charlie kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య (video)

Girl Child: శ్రీకాళహస్తిలో బాలికల జనన నిష్పత్తి తగ్గింది.. అసలేం జరుగుతుంది?

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను సురక్షితంగా తరలిస్తాం : మంత్రి నారా లోకేశ్

నేపాల్ ప్రధాని రేసులో బెంగుళూరు విద్యార్థి

Saharanpur: 11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. పిండిమిల్లులోనే అఘాయిత్యం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

Show comments