ఈమధ్య ఇండస్ట్రీలో అగ్రహీరో సినిమా హిట్టయితే ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిందంటూ.. తెగ ప్రచారాలు సంధిస్తున్నారు. మొన్నటికిమొన్న రచ్చ, నిన్న దమ్ము, నేడు గబ్బర్‌సింగ్ ఎవరికివారు మొదటిరోజు కలెక్షన్లు, వారం కలెక్షన్లు చెప్పుకుంటూ... 81 ఏళ్ళ ఇండస్ట్రీ రికార్డ్‌లను, గత చిత్రాలను రికార్డులను చెరిపేసిందంటూ ఉపన్యాసాలను సక్సెస్ మీట్‌లో ఇవ్వడం మామూలైపోయింది. ఈ రికార్డులకన్నా... డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్లు.. సేఫ్‌గా ఉంటే చాలు అదే రికార్డ్ అని పలువురు పేర్కొంటున్నారు.
గబ్బర్‌సింగ్ సక్సెస్ గురించి నిర్మాత, దర్శకుడు మాత్రం ఇప్పటికీ ఏ సినిమా చేయని రికార్డులు చేసిందని చెప్పారు. అయితే... కలెక్షన్ల మాత్రం చెప్పడంలేదు. కొన్ని కారణాలంటూ ఐటీ గురించి, ఫ్యాన్స్‌లో గందరగోళం ఎందుకని చెప్పడంలేదని అంటున్నా.. అందులో పస లేదని తెలుస్తోంది. ఎక్కువ థియేటర్లు ఇవ్వడంతో సహజంగానే ఉన్న కలెక్షన్లు.. పాజిటివ్ టాక్ వస్తే...పెరుగుతాయని మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.
కాగా, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత గణేష్‌లు మాత్రం... పవన్‌కళ్యాన్ నెంబర్ 1 స్థాయికి వెల్ళిపోయాడని ప్రచారం మొదలెట్టారు. కేవలం ఒక్క చిత్రంతోనే నెంబర్1కి వెళితే... అప్పుడప్పుడు చిన్నపాటి తేడా చేస్తూ... ఎక్కువ సక్సెస్‌లు ఇస్తున్న రవితేజలాంటి హీరోలు ఏ కోవకు చెందుతారని ప్రశ్నిస్తున్నారు. పెద్ద హీరోల చిత్రాలకన్నా... అల్లరి నరేష్ వంటి హీరోల చిత్రాలు తమకు సేఫ్ ప్రాజెక్ట్‌లవుతున్నాయని ఎగ్జిబిటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి ఏం చెపుతారో..?!!