Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లైమాక్స్ మినహా థ్రిల్లర్ మూవీ 'మంగళ' షూటింగ్ పూర్తి!

Webdunia
WD
" మంత్ర" ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఛార్మింగ్ గాళ్ ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం "మంగళ". ఓషో తులసీరామ్ స్వీయదర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న థ్రిల్లర్ "మంగళ".. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో పాటల చిత్రీకరణ జరుపుకుంది.

క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి చిత్ర దర్శకనిర్మాత ఓషో తులసీరామ్ మాట్లాడుతూ.. "ఇదొక విభిన్న చిత్రం. ఛార్మి నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గతంలో మా కాంబినేషన్‌లో వచ్చిన 'మంత్ర' ఎంతటి విజయంసాధించింతో, అంతకు మించిన విజయం ఈ 'మంగళ' సాధిస్తుందని ఆశిస్తున్నాను. పాటలతో సహా టాకీ పార్టుతో పాటు షూటింగ్ పూర్తయింది. క్లైమాక్స్ సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నాం" అన్నారు.

ఛార్మి, ప్రదీప్‌రావత్, సుభాష్, విజయ్‌సాయి, పావల శ్యామల, ఉత్తేజ్, సారికా రామచంద్రరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: జంధ్యం వెంకటేష్‌బాబు, పాటలు: సుద్దాల అశోక్ తేజ, విశ్వ. సంగీతం: విశ్వ, కెమెరా: శివేంద్ర, కో ప్రొడ్యూసర్: బి. నాగేశ్వర్‌రెడ్డి, సమర్పణ: జి. శ్రీధర్, నిర్మాతలు: తులసీరామ్, సీహెచ్‌వీ శర్మ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: తులసీరామ్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

Show comments