Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఈ రోజుల్లో..' ప్రేమ ఎలా ఉందంటే..!?

Webdunia
సోమవారం, 7 నవంబరు 2011 (12:45 IST)
WD
ఈ రోజుల్లో ప్రేమకు విలువలేకుండా పోయింది. రోజుకో సెల్‌ఫోన్‌ మార్చినట్లు ప్రేమికులు తమ ప్రేమల్నికూడా మార్చేస్తున్నారు. అంతరాల వ్యత్యాసం వల్ల యువత ఏమి కోల్పోతుందనేది ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపించే ప్రయత్నం చేస్తుంది ఈ నాటియువత. గుడ్‌సినిమా ప్రొడక్షన్స్‌లో మారుతీ మీడియా హౌస్‌ పతాకంపై ఎస్‌.కె.ఎన్‌. నిర్మిస్తున్నారు.

పలు యాడ్స్‌లో అనుభవంగల మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్ర లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో ఆదివారంనాడు జరిగింది. ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి, నిర్మాత, పబ్లిషర్‌ బి.ఎ.రాజు సంయుక్తంగా లోగోను ఆవిష్కరించారు. యామినేషన్‌రంగంలో నిష్ణాతుడైన దర్శకుడు మారుతీ చిత్రనటీనటుల్ని పరిచయం చేసే కార్యక్రమం ఆకట్టుకుంది. దీనితోనే తనలోని ప్రతిభను దర్శకుడు రుచి చూపించాడని అచ్చిరెడ్డి ప్రశంసించారు. ఈరోజుల్లో యువత, వ్యవస్థ ఎలా ఉందనేది ప్రధానంశంగా తీసుకుని దాన్ని పూర్తి వినోదాత్మకంగా తీయడం అభినందించతగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు.

బి.ఎ.రాజు వ్యాఖ్యానిస్తూ... ఇటువంటి చిత్రాలు ఇండస్ట్రీకి చాలా అవసరం. గుడ్‌సినిమా గ్రూప్‌ అనే పేరుతోనే గుడ్‌లుక్‌ ఉంది. ఈ చిత్ర దర్శకుడు 'ఎ ఫిలిం బై అరవింద్‌' చిత్రాన్ని పనిచేయడమేగాకుండా నిర్మాణవ్యవహరాలుకూడా గ్రహించారని తెలిపారు.

దర్శకుడు మారుతీ చిత్రం గురించి చెబుతూ.. ఈరోజుల్లో యువతకి ప్రేమ అనేది యూజ్‌ అండ్‌ త్రో పంథాలో తయారైంది. ఫోన్‌ నెంబర్‌మార్చినట్లు మార్చేస్తున్నారు. ఇలాంటివి తననితాను స్క్రీన్‌ఫై చూసుకుంటే ఎలా ఫీలవుతారు అనేట్లుగా చిత్రాన్ని తీశాం. సంభాషల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది.

జంథ్యాల, వంశీ సినిమాల స్పూర్తిగా తీసుకున్నాను. అంతా కొత్తవారే బాగా నటించారు. ప్రభాకర్‌రెడ్డి కెమెరాపనితం అద్భుతంగా వచ్చింది. సంగీతం కథలోభాగంగా ఉంటూ వినసొంపుగా ఉంటుందని చెప్పారు.

నిర్మాత ఎస్‌కెఎన్‌. మాట్లాడుతూ, దర్శకుడు అల్లు అర్జున్‌కు మంచి స్నేహితుడు. యానిమేషన్‌ వర్క్‌కూడా చేశాడనీ, అప్పుడే తను చెప్పిన కథ నచ్చి నా స్నేహితులతో కలిసి చిత్రాన్ని నిర్మించాను. ఐదు పాటలున్నాయి. అందరూ తెలుగువారే నటించిన చిత్రమిదని తెలిపారు.

చిత్ర హీరో శ్రీనివాస్‌ మాట్లాడుతూ, తన చిరకాల కోరిక తీరినందుకు ఆనందంగానూ మంచి కథాంశంగల చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్‌ రేష్మ మాట్లాడుతూ, ఫ్రెండ్‌షిప్‌ ఫెయిల్‌ అయితే ఎలాఉంటుందనేది తన పాత్రద్వారా చూపించారనీ, ఈ చిత్రం సక్సెస్‌కావాలని ఆశించారు.

ఇంకా ఈ చిత్రంలో ఎం.ఎస్‌. నారాయణ, సాయికుమార్‌ పంపన, అంబటి శ్రీను తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, సహనిర్మాత: ఎం. శివరామి రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ఫ్లే, దర్శకత్వం: మారుతీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Prakash Raj: ఎవరైనా దీన్ని పవన్ కళ్యాణ్‌కి వివరించగలరా?: హిందీపై ప్రకాష్ రాజ్

వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి: ఆరేళ్లు గడిచినా న్యాయం జరగలేదు.. సునీత

Mark Carney: కెనడా కొత్త ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం

Sunita Williams: తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి రానున్న సునీత, బుచ్ విల్మోర్ (video)

Kakinada: పోటీ ప్రపంచం.. నా బిడ్డలు గట్టెక్కలేరు.. చంపేస్తున్నా.. ఆత్మహత్య చేసుకుంటున్నా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

Show comments