అక్కినేని నాగేశ్వరావు నటించన, ప్రతిభా వారి 'బాలరాజు' చిత్రం విజయవాడలో 1948 ఫిబ్రవరి 26న రిలీజై రోజుకు మూడు ఆటలతో 428 రోజులు ప్రదర్శించబడింది. ఈ చిత్రంలా ఆనాడు ఏ చిత్రం ప్రదర్శించబడలేదు. పైగా ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్స్ ఆనాడు ఏ చిత్రం వసూలు చేయలేదు.
నాగేశ్వరారావు నటించిన 43వ చిత్రం 'రోజులు మారాయి'. 14-4-1955న రిలీజైన ఈ చిత్రం 17 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అక్కినేని నాగేశ్వరావు నటించన 'ముగ్గురు మరాఠీలు' చిత్రంతో ఈ వేడుకులు జరుపుకోవటం మొదలయింది.
' తొమ్మిది' పాత్రలు ధరించిన ఏకైక నటుడు...
తెలుగు చలనచిత్ర రంగంలో అక్కినేని నాగేశ్వరావు మొదటిసారిగా ప్రసాద్ ఆర్ట్‌పిక్చర్స్ సమర్పణలో విజయచాముండేశ్వరి పిక్చర్స్ (సావిత్రి స్వంత సంస్థ) వారి 'నవరాత్రి' చిత్రంలో తొమ్మిది పాత్రలను పొషించి మెప్పించారు. ఈ చిత్రంలో(1) కోపిష్టి గోపన్న (2) పల్లెటూరు రైతు శాంతన్నగా, (3)కుష్టు రోగి సుందరామయ్య, (4)భాగవతారు శ్రీనివాస్‌లుగా (5) పోలిస్ ఆఫీసర్ (6) నవ ప్రేమికుడు వేణుగా, (7) డాక్టర్ కరుణాకర్‌గా (8) దేవదాసుగా (9) ఆనందరావుగా ఇలా ఇందులో తొమ్మిది పాత్రలు పోషించిన ఏకైక తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరావు. 'నవరాత్రి' చిత్రం 22-4-1966న రిలీజైంది.
తెలుగులో మొదట ద్విపాత్రాభినయం...
అన్నపూర్ణ పిక్చర్స్‌వారు నిర్మించిన 'ఇద్దరు మిత్రులు' చిత్రంలో మొదటిసారిగా ద్విపాత్రాభినయం గల పాత్రలు ధరించారు. ఈ చిత్రం 29-12-1961న రిలీజై రజతోత్సవం (175 రోజులు) జరుపుకొన్నది.
గోల్డెన్ డిస్క్ పొందిన అక్కినేని నటించిన చిత్రాలు...
ప్రేమాభిషేకం:- దక్షిణ భారత దేశంలో చలన చిత్ర రంగంలో మొదటగా గ్రామ ఫోన్ రికార్డుల అమ్మకంలో 'గోల్డన్ డిస్క్' పొందిన ఘనత అక్కినేని నటించిన 'ప్రేమాభిషేకం' చిత్రానికి మాత్రమే దక్కింది. ఒక సినిమా రికార్డులు 50 వేలు యూనిట్లు అమ్ముడైతే 'గోల్డన్ డిస్క్' వస్తుంది. గతంలో కన్నడ, మళయాళం భాషలలో కూడా ఏ చిత్రానికి 'గోల్డన్ డిస్క్' రాలేదు. ఈ 'గోల్డన్‌డిస్క్'' 'సి' రికార్డువారి ద్వారా లభించింది. 'ప్రేమాభిషేకం' చిత్రానికి మాత్రమే అప్పట్లో ఈ 'గోల్డన్ డిస్క్' వచ్చింది.
మేఘసందేశం :- సినిమా విడుదల కాకుండానే 30 వేల గ్రామ పోన్ రికార్డులుగాని క్యాసెట్లు గానీ అమ్ముడు పోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ రికార్డు కేవలం అక్కినేని నాగేశ్వరావు నటించిన 200వ చిత్రం 'మేఘసందేశం'కు దక్కింది. లక్ష యూనిట్లు రికార్డుల అమ్మకం 22-9-1982 నాటికి పూర్తి అవగా, యస్.ఇ.ఎ.కంపినీ వారు మద్రాసు సవేరా హోటలలో ఒక సభ జరిపి, తమ డీలర్లును (రికార్డులను, క్యాసెట్లును అమ్మినవారిని) ఘనంగా సన్మానించి అభినందించినారు. అసలు చిత్రం విడుదల కాకముందే 'గోల్డన్ డిస్క్' సాధించిన ప్రప్రథమ తెలుగు మరియు దక్షిణ భారత చలన చిత్రం ఒక్క అక్కినేని నాగేశ్వరావు నటించిన 'మేఘసందేశం' మాత్రమే. ఇప్పటి వరకు (2011) కూడా ఇదే రికార్డు.
పూర్తిపేరు: అక్కినేని నాగేశ్వరావుగారు
తండ్రిగారుపేరు: అక్కినేని వెంకటరత్నం
తల్లిగారి పేరు: అక్కినేని పున్నమ్మ
పుట్టిన తేది: 20-9-1924
పుట్టిన ఊరు: వెంకటరాఘవపురం (గుడివాడ దగ్గర కృష్ణా జిల్లా)
అర్థాంగి పేరు: శ్రీమతి అన్నపూర్ణ
కుమారులు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
కూమార్తెలు: శ్రీమతి సత్యవతి, శ్రీమతి నాగ సుశీల, శ్రీమతి నాగ సరోజ
నటించిన మొదటి చిత్రం: శ్రీ సీతారామ జననం
విడుదలైన మొదటి చిత్రం: ధర్మపత్ని (10-1-1941)
100 వ చిత్రం: గుండమ్మకథ
200 వ చిత్రం: మేఘసందేశం
హిందీలో నంటించిన ఒకే ఒక చిత్రం: సువర్ణ సుందరి
తెలుగులో నటించిన చిత్రాలు: 254
తమిళంలో నటించిన చిత్రాలు: 11
అన్ని భాషలలో నటించన చిత్రాలు: 266
వివాహము జరిగినది: 18-2-1949
అన్నపూర్ణ స్టూడియోకు శంకు స్థాపన చేసినది: 13-8-1975
స్టూడియో ప్రారంభించింది: 14-1-1976
స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న మొదటి సినిమా: సురేష్ మూవీస్ వారి సెక్రటరీ
ప్రస్తుతం (2011) నటిస్తున్న చిత్రం: శ్రీరామరాజ్యం
జతకట్టిన హిరోయిన్స్: 76