Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు ఇదే.. ఆత్మీయులతో మంతనాలు!

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (08:46 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్. షర్మిల కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమైపోయింది. ఇదే అంశంపై ఆమె మంగళవారం తన మద్దతుదారులతో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనకు అత్యంత సన్నిహితులైన నేతలతో కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
 
ముఖ్యంగా, తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్తగా స్థాపించనున్న పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఆమె నామకరణం చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు పార్టీ పేరు రిజిస్టర్‌ కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని షర్మిల బృందం సంప్రదించినట్లు చెబుతున్నారు. మార్చి నాటికి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. 
 
ఇదే అంశంపై ఆమె తన సన్నిహితుల వద్ద మాట్లాడుతూ, మన పార్టీ పేరు వైఎస్ఆర్ టీపీ (వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ పార్టీ), దీని జెండా, ఎజెండా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయన్నారు. వైఎస్సార్‌ అంటే ఆంధ్రా పార్టీ అనే అభిప్రాయం ఉంటుంది కదా? అని జిల్లా నేతలు ప్రశ్నించగా, 'వైఎస్సార్‌ అంటే తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే పార్టీ పేరు వైఎస్సార్‌టీపీగా పెడతాం' అని షర్మిల బదులిచ్చారు. 
 
'అన్న ఇప్పటికే ఆంధ్రాలో సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలంగాణలో సీఎం కాలేడు. అందుకే నేను ప్రత్యేక పార్టీ పెడుతున్నా.. లీడ్‌ తీసుకుంటున్నా, ఒక చెల్లికి అన్న ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, విభేదాలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి' అని ఆమె నేతలతో వ్యాఖ్యానించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments