టెక్నాల‌జీతో మోసం చేస్తూ... అడ్డంగా బుక్కైన మాయ‌లేడి...

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (17:30 IST)
టెక్నాల‌జీ స‌హాయంతో మోసం చేస్తూ.. డ‌బ్బులు వ‌సూలు చేస్తుంది ఓ యువ‌తి. ఇంత‌కీ ఏం చేస్తుందంటే... పలు పాఠశాలలకి చెందిన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్ నుండి స్కూల్ ఫొటోలను డౌన్లోడ్ చేసి మార్ఫింగ్‌లకు పాల్పడి బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఆ ఫోటోలను తిరిగి బాధిత స్కూల్స్‌కి పంపిస్తుంది ఆ కిలాడి లేడి. 
 
తాను సైబర్ సెక్యూరిటీలో పని చేస్తున్నట్టు నమ్మించి ఈ ఫోటోలు తీసేస్తానని చెప్పి బాధితుల నుండి డబ్బు వసూలు చేస్తుంద‌ట‌. ఈ మాయ‌లేడీ బాగోతం బ‌య‌ట‌ప‌డ‌టంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. హైదరాబాదులో నాలుగు పాఠశాలలకి చెందిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఇది వెలుగులోకి వ‌చ్చింది.
 
నిందితురాలిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితురాలు సెల్ ఫోన్లో 225కు పైగా స్కూల్స్ గ్రూపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉన్నత చదువు చదువుకున్న‌ప్ప‌టికీ ఈజీ మనీ కోసం టెక్నాలజీని వాడి ఈ తరహా నేరానికి పాల్ప‌డుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments