Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్కెట్ అడిగితే రైల్వే మహిళా టీసీని చిత్తుగా కొట్టారు!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (09:23 IST)
హైదరాబాద్‌, బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా రైల్వే టీసీపై ఎనిమిది మంది దుండగులు దాడి చేశారు. ఇంతకీ ఈ మహిళా టీసీ చేసిన నేరం.. వారిని టిక్కెట్ అడగడమే. ఈ సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. 
 
బేగంపేట ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌లో టి కౌసల్య అనే మహిళా టీసీ తన విధులను నిర్వహిస్తుంది. ఆ సమయంలో పలువురు యువకులను టిక్కెట్లు చూపించమని అడిగింది. అంతే ఒక్కసారి ఎనిమిది మంది దండగులు ఆమెను చితకబాది, అక్కడ నుంచి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. 
 
నిజానికి ఇటీవల కాలంలో హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్ళలో టీసీలపై దాడులు ఎక్కువయ్యాయి. మొన్నటికిమొన్న ఓ మహిళా టీసీని రైల్లోంచి కిందికినెట్టివేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా, గురువారం ఓ ఎంఎంటీఎస్ రైలులో టికెట్ అడిగిన టీసీ కౌసల్యపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు గాయాలయ్యాయి. దీనిపై బేగంపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments