Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం ఇప్పించా.. మరి నా సంగతేంటి' : సర్పంచ్‌ భర్తకు చెప్పుదెబ్బలు

ఓ గ్రామ సర్పంచ్‌కు చెప్పుదెబ్బలు పడ్డాయి. టీచర్ ఉద్యోగం ఇప్పించినందుకు బహుమతిగా తన కోర్కె తీర్చాలంటూ వేధించినందుకు ఆ మహిళ తనదైనశైలిలో సమాధానం చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి పట్టణంలో జరిగిన

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (14:06 IST)
ఓ గ్రామ సర్పంచ్‌కు చెప్పుదెబ్బలు పడ్డాయి. టీచర్ ఉద్యోగం ఇప్పించినందుకు బహుమతిగా తన కోర్కె తీర్చాలంటూ వేధించినందుకు ఆ మహిళ తనదైనశైలిలో సమాధానం చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి పట్టణంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పెద్దపల్లి మండలం మూలసాల‌ సర్పంచ్ భర్త కొమరయ్య. ఈయన తన పలుకుబడిని ఉపయోగించి పుష్పలత అనే మహిళకు అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా ఇప్పించాడు. ఆ తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. "నీకు అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం ఇప్పించాను. నా సంగతి ఎప్పుడు చూస్తావు?" అంటూ లైంగికంగా వేధించాడు. 
 
ఈ వేధింపులను తట్టుకోలేని బాధితురాలు సర్పంచ్ భర్తను చెప్పుతో కొట్టడమేకాకుండా, స్థానిక పోలీస్ పోలీసులను ఆశ్రయించింది. తన కోరిక తీర్చాల్సిందేనని వెంటపడుతుంటే, తట్టుకోలేక చెప్పుతో కొట్టానని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కొమరయ్య మరోలా స్పందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తాను పాఠశాలలోకి మార్పించినందునే తమ ఆటలు సాగవన్న భయంతో ఆమె ఈ విధమైన దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అయితే, చెప్పుదెబ్బల విషయం బయటకు పొక్కిన తర్వాత, గ్రామ పెద్దలు ఇద్దరి మధ్యా రాజీ కుదర్చినట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం