Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా లేదని భర్త వేధింపులు.. తాళలేక వివాహిత ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (09:33 IST)
అందం కోసం ఆ భర్త భార్యను వేధించాడు. రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అంతే మనస్తాపానికి గురైన ఆ మహిళ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, నారాయణఖేడ్‌కు చెందిన హలీమాబేగం (25) కు బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన అబ్దుల్‌ హాసిఫ్‌ (32) తో 2018 జూన్‌లో వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడున్నాడు.
 
కాగా.. గత కొద్ది కాలంలా.. హాలీమా బేగం అందంగా లేదని.. లావుగా ఉందని.. మరో పెళ్లి చేసుకుంటానని అబ్దుల్ హాసిఫ్ వేదించసాగాడు. అత్త బీబీ ఫాతీమా, మామ అబ్దుల్ జానీమియా సైతం సూటిపోటి మాటలు అనేవారు. ఈ విషయాన్ని హలీమా పుట్టింటి వారి దృష్టికి తీసుకెళ్లింది. అత్తింటి వారితో వారు మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. 
 
ఈ క్రమంలో.. విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని, తనను తీసుకెళ్లాలని గురువారం ఉదయం హలీమా తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆ తరువాత ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేసింది. ఫోన్ ఎత్తి మాట్లాడిన తోటికోడలు హలీమాబేగం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పింది. వెంటనే నగరానికి చేరుకున్నారు హాలీమా తల్లిదండ్రులు. తమ కుమార్తె మరణానికి భర్త, అత్తామామ వేదింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments