వేధింపులు తాళలేక.. భర్త కళ్లముందే భార్య పురుగుల మందు తాగింది

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:09 IST)
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక.. ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఎదురుగా ఉండగానే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం. ఎం. పహాడీలో శుక్రవారం చోటు చేసుకుంది.
 
ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. భర్త వేధింపు భరించలేక రాజేంద్ర నగర్‌‌కు చెందిన షభానా బేగమ్ అనే వివాహిత… పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. తను పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నానని… ఇక నుండి నీవు ప్రశాంతంగా ఉండు అంటూ భర్తతో చెప్పి తన ముందే పురుగుల మందు సేవించింది.
 
భార్య విషం సేవించిందనే విషయం తెలిసి కూడా భార్యను కాపాడాల్సింది పోయి.. మూర్ఖంగా ప్రవర్తించాడు దుర్మార్గుడు సాజీద్. తన ముందే గిల గిలా కొట్టుకుంటున్నా ఆసుపత్రికి తీసుకొని వెళ్లకుండా పైశాచిక ఆనందాన్ని పొందాడు. చివరకు ఆ అభాగ్యురాలు ప్రాణాలు విడిచింది. 
 
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షభానా మృతితో తన ఐదుగురు పిల్లలు అనాథలు అయ్యారు. కాగా.. రెండు రోజుల కిందటే… నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments