పడకగదిలో ప్రియుడితో రొమాన్స్.. వీడియో తీసి భర్తకు షేర్ చేసిన భార్య... తర్వాత?

ఆమె భార్యాభర్తల అనుబంధానికి మచ్చతెచ్చింది. కుటుంబ సంబంధాలను ప్రశ్నార్థకం చేసింది. తన ప్రియుడితో పడకగదిలో గడిపిన శృంగార క్రీడా వీడియోను ఏకంగా భర్తకు షేర్ చేసింది. అంతేనా... భర్త కట్టిన తాళిని తెంచి.. ప

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (14:34 IST)
ఆమె భార్యాభర్తల అనుబంధానికి మచ్చతెచ్చింది. కుటుంబ సంబంధాలను ప్రశ్నార్థకం చేసింది. తన ప్రియుడితో పడకగదిలో గడిపిన శృంగార క్రీడా వీడియోను ఏకంగా భర్తకు షేర్ చేసింది. అంతేనా... భర్త కట్టిన తాళిని తెంచి.. ప్రియుడితో మళ్లీ మూడుముళ్ళు వేయించుకుంది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మంచిర్యాల జిల్లా దండేప‌ల్లి మండ‌లం ధ‌ర్మారావుపేట పంచాయ‌తీ శ్రీరాముల ప‌ల్లె గ్రామానికి చెందిన న‌క్క ధ‌ర్మరాజుకు జ‌గిత్యాల జిల్లా క‌న్నాపూర్‌కు చెందిన ముద్దం నాగ‌ల‌క్ష్మితో గ‌తేడాది వివాహమైంది. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే, రోజులు గ‌డుస్తున్న కొద్దీ నాగలక్ష్మి నిజస్వరూపం బయటకువచ్చింది. 
 
పెళ్లికి ముందే జ‌గిత్యాల జిల్లా వెల్గటూరుకు చెందిన మంత్రి మ‌హేష్ అనే యువ‌కుడితో ప్రేమాయణం సాగించిన విషయం వెల్లడైంది. పుట్టింటికి వెళ్లినప్పుడల్లా ప్రియుడితో కలిసి తిరిగేది. అత్తింటికి వచ్చిన తర్వాత కూడా భర్తముందే ప్రియుడు మహేష్‌తో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడుతూ ఉండేది. ఈనేపథ్యంలో నెలరోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన నాగలక్ష్మి.. తిరిగి రాలేదు. భర్త, అత్తింటివాళ్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. 
 
బదులుగా తన సెల్‌ఫోన్‌ నుంచి భర్త సెల్‌ఫోన్‌కు వాట్సప్‌లో కొన్ని వీడియోలు, ఫోటోలు పంపించింది. ఈ వీడియోలు చూసిన ధర్మరాజు తీవ్రంగా కలత చెందారు. కుటుంబసభ్యులు నివ్వెర పోయారు. నాగలక్ష్మి తన ప్రియుడైన మంత్రి మహేష్‌తో అభ్యంతరకరంగా ఉన్న వీడియో దృశ్యాలను సెల్‌ఫోనులో రికార్డు చేసి భర్తకు షేర్ చేసింది. అతేనా, భర్త ధర్మరాజు కట్టిన తాళిని తీసేసిన నాగలక్ష్మి.. ఆ తాళిని తిరిగి తన ప్రియుడి చేతులతో కట్టించుకుంది. దీన్ని కూడా సెల్‌లో రికార్డు చేసి భర్తకు వాట్సప్‌లో పంపింది. 
 
వీటిని చూసిన భర్త ధర్మరాజు తీవ్రంగా కలత చెందాడు. ఏం చేయాలో అర్థంకాక కుటుంబసభ్యులకు చెప్పుకొని కన్నీరు మున్నీరయ్యాడు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన ధర్మరాజు.. ఈనెల 9వ తేదీన పొలం దగ్గరికి వెళ్లాడు. అక్కడే క్రిమి సంహారక మందు తాగాడు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోద చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments